కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త, డీఏ, డీఆర్ 3 శాతం పెంపు, 34 శాతానికి చేరిక

Union Cabinet Decisions Central Govt Employees Dearness Allowance Increased to 31 Percent, Central Govt Employees Dearness Allowance Increased to 31 Percent, Union Cabinet Decisions, Central Govt Employees, Central Govt Employees Dearness Allowance Increased, Union Cabinet Approves 3% Dearness Allowance Hike For Central Govt Employees, Union Cabinet, Dearness Allowance to be hiked by 3% For Central Govt Employees, Cabinet hikes dearness allowance, central government has hiked the dearness allowance for its employees by 3%, dearness allowance, central government, central government Employees, central government Employees DA to be hiked by 3%, Union Cabinet Latest News, Union Cabinet Latest Updates, Union Cabinet Live Updates, Mango News, Mango News Telugu,

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం నాడు జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) మరియు పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ (డీఆర్) అదనపు వాయిదాను విడుదల చేయడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఉద్యోగులకు ఇచ్చే డీఏ ను, పెన్షనర్లకు ఇచ్చే డీఆర్ ను 3 శాతం పెంచగా, ప్రాథమిక చెల్లింపు/పెన్షన్‌లలో ప్రస్తుతం ఉన్న 31 శాతం నుండి 34 శాతంకు చేరింది. ఈ పెంపు జనవరి 1, 2022 నుండే వర్తిస్తుందని ప్రకటించారు.

ఈ పెంపు 7వ కేంద్ర వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా ఆమోదించబడిన ఫార్ములాకు అనుగుణంగా ఉంటుందని పేర్కొన్నారు. డీఏ మరియు డీఆర్ రెండింటి కారణంగా ప్రభుత్వ ఖజానాపై సంవత్సరానికి ఉమ్మడి ప్రభావం రూ.9,544.50 కోట్లుగా ఉంటుందన్నారు. దీని వల్ల దాదాపు 47.68 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68.62 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందనున్నారని తెలిపారు. 2011 జులైలో 17 శాతంగా ఉన్న డీఏ, డీఆర్ ను ఒకేసారిగా 11 శాతం పెంచడంతో 28 శాతానికి చేరగా, 2021 అక్టోబర్ లో 3 శాతం, తాజాగా 3 శాతం పెంచడంతో 34 శాతానికి చేరుకుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − eight =