దేశంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే రెండు డోసులు పూర్తి చేసుకున్న వారికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా ప్రికాషనరీ డోస్ ఇవ్వటానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్యకు తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఒక లేఖ రాశారు. కోవిడ్-19 వ్యాక్సిన్ బూస్టర్ డోస్ లను కేవలం ప్రయివేటు ఆస్పత్రులకే కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకుంది. అయితే దీనిపై పునఃసమీక్ష చేయాలని మంత్రి హరీష్ రావు లేఖలో కోరారు. ప్రస్తుత పరిస్థులను దృష్టిలో ఉంచుకుని ఇకపై ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా బూస్టర్ డోస్‌కు అనుమతివ్వాలని విజ్ఞప్తి చేశారు.
అయితే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రస్తుతం 60 ఏండ్లు దాటిన వారికి మాత్రమే ప్రికాషనరీ డోస్ వేయటానికి కేంద్రం అనుమతినిచ్చింది. కాగా 18 ఏండ్లు పైబడిన వారికి ప్రికాషనరీ డోస్ కావాలంటే ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రైవేటుతో పాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ అన్ని వయసుల వారికీ ప్రికాషనరీ డోస్ ఇచ్చేందుకు అనుమతించాలని మంత్రి హరీష్ తన లేఖలో పేర్కొన్నారు. కోవిడ్-19 ఇన్ఫెక్షన్‌తో సంబంధం ఉన్న తీవ్రమైన అనారోగ్యం మరియు మరణాల నుండి జనాభాను రక్షించడానికి బూస్టర్ డోస్ అందరికీ ఉచితంగా అందించాలని హరీష్ కోరారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో టీకాలను అనుకున్న లక్ష్యాల మేరకు పూర్తిచేయగలిగామని, ఈ కార్యక్రమంలో మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల నుంచి కూడా పూర్తి సహకారం ఉందని కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు హరీష్ రావు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ