జాతీయస్థాయిలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మే 20 నుంచి పదిరోజుల పాటుగా దేశవ్యాప్తంగా పర్యటించనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ దేశవ్యాప్త పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ మే 20, శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వెంట రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, ఎంపీలు సంతోష్‌కుమార్, రంజిత్‌రెడ్డి ఉన్నారు. కాగా శనివారం ఢిల్లీలో ప్రముఖ ఆర్థికవేత్తలతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా వారితో దేశ ఆర్థిక పరిస్థితులపై చర్చించనున్నారు.
అలాగే సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తో పాటుగా మరికొందరు రాజకీయ ప్రముఖులతో కూడా సీఎం కేసీఆర్ సమావేశమై దేశంలో తాజా పరిస్థితులు సహా, పలు అంశాలపై చర్చించనున్నట్టు తెలుస్తుంది. ఢిల్లీ పర్యటన అనంతరం చండీఘర్, బెంగళూరు, రాలేగావ్ సిద్ధి సహా పలు ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ పర్యటించి సామాజిక, రాజకీయ సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF