నేడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 31వ వర్ధంతి.. ఘనంగా నివాళులర్పించిన సోనియా, రాహుల్, ప్రియాంక

Former PM Rajiv Gandhi 31st Death Anniversary Congress Leaders Sonia Priyanka and Rahul Pay Homage, Former PM Rajiv Gandhi 31st Death Anniversary Congress Leaders Sonia Gandhi Pay Homage, Former PM Rajiv Gandhi 31st Death Anniversary Congress Leaders Priyanka Gandhi Pay Homage, Former PM Rajiv Gandhi 31st Death Anniversary Congress Leaders Rahul Gandhi Pay Homage, Former PM Rajiv Gandhi 31st Death Anniversary, Congress Leaders Sonia Priyanka and Rahul Pay Homage, Congress Leaders Sonia Gandhi, Congress Leaders Priyanka Gandhi, Congress Leaders Rahul Gandhi, Rajiv Gandhi 31st Death Anniversary, Former PM 31st Death Anniversary, 31st Death Anniversary, Former PM Rajiv Gandhi 31st Death Anniversary News, Former PM Rajiv Gandhi 31st Death Anniversary Latest News, Former PM Rajiv Gandhi 31st Death Anniversary Latest Updates, Former PM Rajiv Gandhi Death Anniversary, Rajiv Gandhi Death Anniversary, Mango News, Mango News Telugu,

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 31వ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు సోనియా, ప్రియాంక, రాహుల్ ఘనంగా నివాళులర్పించారు. రాజీవ్ గాంధీ సతీమణి, కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ మరియు కుమార్తె ప్రియాంక గాంధీ ఢిల్లీలోని వీరభూమి వద్ద దివంగత మాజీ ప్రధానికి నివాళులర్పించారు. వీరితో పాటుగా ఇతర కాంగ్రెస్ నాయకులు కూడా మాజీ ప్రధానికి నివాళులర్పించారు. కాంగ్రెస్ అగ్ర నేతలు పి చిదంబరం, సచిన్ పైలట్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ కుమారుడు, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా తన తండ్రికి నివాళులర్పిస్తూ ట్విట్టర్‌లో ఒక భావోద్వేగ పోస్టును పంచుకున్నారు.

“నా తండ్రి ఒక దార్శనిక నాయకుడు. అతని విధానాలు ఆధునిక భారతదేశాన్ని రూపొందించడంలో సహాయపడ్డాయి. అతను దయగల వ్యక్తి, నాకు మరియు ప్రియాంకకు అద్భుతమైన తండ్రి. క్షమాపణ మరియు సానుభూతి యొక్క విలువను మాకు నేర్పించారు. నేను ఆయనను ఎంతో కోల్పోతున్నాను మరియు ప్రేమతో మేము కలిసి గడిపిన సమయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాను” అని ఆ పోస్టులో పేర్కొన్నారు రాహుల్ గాంధీ. మే 21, 1991 రాత్రి తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో ఎన్నికల ర్యాలీలో ధను అనే ఆత్మాహుతి బాంబర్‌తో రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు. ఆయనతో పాటు మరో పద్నాలుగు మంది కూడా ఆ దురదృష్టకర ఘటనలో మరణించారు. అయితే రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషిగా తేలిన నిందితులలో ఒకరైన ఏజీ పేరరివాళన్​ 31 సంవత్సరాల తర్వాత జైలు నుండి ఇటీవలే బెయిలుపై విడుదలయ్యారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + 14 =