అభ్యర్థిని నేనే.. పార్టీ మాత్రం అది కాదు..!

I Am the Candidate but the Party Is Not That,I Am the Candidate,but the Party Is Not That,Election Process,Not Naming the Cm Candidate,the Purpose of Political Parties,Telangana Politics,Mango News,Mango News Telugu, Telangana Assembly Elections, Congress, BJP, BRS, Telangana Latest News and Updates, Telangana Political News and Updates,Telangana Assembly Elections Latest News,Telangana Assembly Elections Latest Updates,Telangana BJP News Today
telangana politics, telangana assembly elections, congress, bjp, brs,

‘అవ్వా.. బాగున్నావా.. ’

‘ఆ బాగున్నాను.. అయ్యా.. నువ్‌ మంచిగున్నవా.. గేంది సానాల్లకు కనిపించినవ్‌’

‘గే ఎలచన్లు కదా..’ ‘నువ్వు రావాలా బిడ్డా.. మన కారుకే నా ఓటు..’ అనగానే.. ఆ అభ్యర్థి కంగారుపడ్డాడు. ‘అవ్వా.. నే ఇప్పుడా పార్టీలో లే.. హస్తం గుర్తుకు వేయాలే’ అని కోరాడు.

తెలంగాణ ఎన్నికల్లో చాలా మంది అభ్యర్థులకు ఈ పరిస్థితి ఎదురవుతోంది. గతంలో వేరే గుర్తుపై పోటీ చేసి.. ఇప్పుడు ఇంకో పార్టీ నుంచి పోటీ చేస్తున్న వాళ్లు ప్రచారంలో తమ ఎన్నికల గుర్తును నొక్కి వక్కానించాల్సి వస్తోంది.

ఎన్నికల వేళ పార్టీలు మారిన నేతలకు లెక్కేలేదు. కారు దిగి చాలా మంది ముఖ్యలు హస్తం గూటికి చేరారు. అలాగే కొందరు కాంగ్రెస్‌, బీజేపీ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీలో ప్రాధాన్యం లేదని కొందరు.. టికెట్లు దక్కక కొందరు.. తమకు నచ్చని వాళ్లకు టికెట్లు ఇచ్చారని ఇంకొందరు ఇలా పార్టీలు మారారు. ఇంకా మారుతూనే ఉన్నారు. అలా పార్టీలు మారి వచ్చిన వారికి ఇతర పార్టీల్లో ఎమ్మెల్యే టికెట్లు దక్కాయి. అలా మారి.. వేరే పార్టీలో టికెట్‌ పొందిన ముఖ్యుల్లో తుమ్మల నాగేఽశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, పాయం వెంకటేశ్వర్లు, మైనంపల్లి హనుమంతరావు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, వేముల వీరేశం, రాథోడ్‌ రమేష్‌, వినయ్‌కుమార్‌, ఏలేటి మహేశ్వరరెడ్డి, శ్యాంనాయక్‌, బండి రమేశ్‌, జగదీశ్వర్‌ గౌడ్‌ తదితరులు ఉన్నారు.

గత ఎన్నికల్లో ఒక పార్టీ నుంచి పోటీ చేసి.. ఇప్పుడు ఇంకో పార్టీ నుంచి పోటీ చేస్తున్న వారు మాత్రం.. అభ్యర్థిని నేనే.. పార్టీ మాత్రం అది కాదు.. అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వస్తోంది. అమ్మా ఈసారి మన గుర్తు కారు.. అయ్యా.. ఈసారి మన గుర్తు హస్తం.. అన్న ఈసారి మన గుర్తు కమలం.. అని గుర్తులనే ఎక్కువగా ప్రచారం చేసుకోవాల్సి వస్తోంది. అలాంటి వారిలో కొంతమంది నేతలు షెడ్యూలు వెలువడ్డాక పార్టీ మారితే.. మరికొందరు 2018 ఎన్నికల్లో గెలిచిన తరువాత కొన్నాళ్లకే అధికార పార్టీలో చేరిపోయారు. అలా బీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన వారిలో దాదాపు 12 మంది కాంగ్రెస్‌ వారుండగా, ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలున్నారు (సండ్ర, మెచ్చా). కాంగ్రెస్‌ నుంచి గెలిచిన ఇల్లందు, పినపాక, కొత్తగూడెం, పాలేరు ఎమ్మెల్యేలు కూడా ఆ తరువాత భారత రాష్ట్ర సమితిలో చేరారు. ఇలా మరికొంతమంది ఎమ్మెల్యేలు హస్తాన్ని వీడి కారెక్కారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × five =