దేశంలో త్వరలో వివిధ రాష్ట్రాల్లో జరగనున్న రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలు-2022 కోసం భారతీయ జనతా పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ 16 పేర్లకు ఆమోదం తెలిపింది. 9 రాష్ట్రాలకు సంబంధించి త్వరలో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాలకు 16మంది అభ్యర్ధులను బీజేపీ ఆదివారం నాడు ప్రకటించింది. బీజేపీ సీనియర్ నేతలు, కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్ లకు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రాల నుంచే మరోసారి రాజ్యసభకు అవకాశమిచ్చారు. ముందుగా తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా ఒకరిని బీజేపీ రాజ్యసభకు పంపనుందని ప్రచారం జరిగినప్పటికీ, తాజాగా ప్రకటించిన జాబితాలో ఎవరు చోటు దక్కించుకోలేదు.
ముందుగా దేశంలోని కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, తమిళనాడు, బీహార్, ఛత్తీస్ గఢ్, హర్యానా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి 15 రాష్ట్రాల్లో త్వరలో ఖాళీ కానున్న 57 రాజ్యసభ స్థానాలకు మే 24న ఎన్నికల నోటిఫికేషన్స్ విడుదల అయ్యాయి. ఈ స్థానాలకు మే 24 నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవగా, నామినేషన్ల స్వీకరణకు తుదిగడువు మే 31గా నిర్ణయించారు. జూన్ 1న నామినేషన్ల పరిశీలన జరగనుండగా, జూన్ 3 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. ఇక ఈ రాజ్యసభ స్థానాలకు జూన్ 10వ తేదీన ఎన్నికలు జరుగుతాయని, ఓట్ల లెక్కింపు పక్రియ కూడా అదే రోజున జరుగుతుందని ఈసీ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ, కాంగ్రెస్ సహా పలు పార్టీలు ఆయా రాష్ట్రాల్లో తమ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తున్నారు.
బీజేపీ ప్రకటించిన రాజ్యసభ అభ్యర్థుల జాబితా ఇదే:
- మధ్యప్రదేశ్ – సుశ్రి కవితా పాటిదార్
- కర్ణాటక – నిర్మలా సీతారామన్
- కర్ణాటక – జగ్గేష్
- మహారాష్ట్ర – పీయూష్ గోయల్
- మహారాష్ట్ర – అనిల్ సుఖ్ దేవ్ రావ్ బోండే
- రాజస్థాన్ – ఘనశ్యామ్ తివారీ
- ఉత్తరప్రదేశ్ – లక్ష్మీకాంత్ వాజ్ పేయి
- ఉత్తరప్రదేశ్ – రాధామోహన్ అగర్వాల్
- ఉత్తరప్రదేశ్ – సురేంద్ర సింగ్ నాగర్
- ఉత్తరప్రదేశ్ – బాబూరామ్ నిషాద్
- ఉత్తరప్రదేశ్ – దర్శనా సింగ్
- ఉత్తరప్రదేశ్ – సంగీతా యాదవ్
- ఉత్తరాఖండ్ – కల్పనా సైనీ
- బీహార్ – సతీష్ చంద్ర దూబే
- బీహార్ – శంభు శరణ్ పటేల్
- హర్యాణా – క్రిషన్ లాల్ పన్వర్
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF