2-18 ఏళ్లున్న వారిపై కొవాగ్జిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌, భారత్ బయోటెక్ కు డీసీజీఐ‌ అనుమతి

DCGI Approves Phase 2/3 Clinical Trial of COVAXIN in the Age Group of 2 to 18 Years,Mango News,Mango News Telugu,COVID-19,COVID-19 Latest Updates,Coronavirus Updates,COVID-19 Cases,Corona Updates,Covid Vaccination,Covid Vaccine,COVID-19 Vaccine,Coronavirus Vaccine,COVAXIN,DCGI,DCGI Approves Phase 2/3 Clinical Trial of COVAXIN,Covaxin Vaccine,Covaxin,DCGI approves Phase 2/3 clinical trials of COVAXIN,DCGI Approves Phase 2/3 Clinical Trial Of Covaxin,Bharat Biotech to conduct Covaxin trial,DCGI Approves Phase 2 And Phase 3 Clinical Trials Of COVAXIN,DCGI Approves Covaxin Clinical Trial On 2-18 Year Age Group,Covaxin Trial In Children,Covaxin Trial,Covaxin Trial On 2-18 Year Age Group,Covaxin Trial News

హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన “కొవాగ్జిన్‌” కరోనా వ్యాక్సిన్ ను దేశవ్యాప్తంగా ఇప్పటికే పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం 18 ఏళ్లు పైబడినవారికే వ్యాక్సిన్ పంపిణీ జరుగుతుండగా పిల్లలకు వ్యాక్సిన్ ఇచ్చే విషయంలో మరో ముందగుడు పడింది. తాజాగా 2-18 ఏళ్లున్న వారిపై రెండు/మూడో దశల్లో కొవాగ్జిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ చేపట్టేందుకు భారత్ బయోటెక్ సంస్థకు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (‍డీసీజీఐ‌) అనుమతినిచ్చింది. ఈ క్లినికల్‌ ట్రయల్స్‌ కు సంబంధించి సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్ కమిటీ (ఎస్‌ఈసీ) చేసిన సిఫారసులను సమగ్రంగా పరిశీలించి డీసీజీఐ‌ ఆమోదం తెలిపినట్టు పేర్కొన్నారు.

ముందుగా 2-18 ఏళ్లున్న వారిపై రెండు/మూడో దశల క్లినికల్‌ ట్రయల్‌ చేపట్టేందుకు భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ డీసీజీఐ‌కి ప్రతిపాదన సమర్పించింది. ఈ ప్రతిపాదనపై మే 11న ఎస్‌ఈసీ చర్చించింది. సమగ్ర చర్చ అనంతరం క్లినికల్ ట్రయల్ నిర్వహించడానికి అనుమతి మంజూరు చేయాలని బుధవారం నాడు డీసీజీఐ‌కి సిఫార్సు చేశారు. కాగా కమిటీ సూచించిన షరతులకు లోబడి ఈ క్లినికల్ ట్రయల్స్ జరుగనున్నాయి. స్వచ్ఛందంగా ముందుకువచ్చిన 525 ఆరోగ్యవంతులపై భారత్ బయోటెక్ సంస్థ ప్రయోగాత్మకంగా ఈ క్లినికల్ ట్రయల్స్ జరపనుంది.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + 7 =