భారత్-న్యూజిలాండ్‌ మధ్య తోలి టీ20 రేపే

1st T20I Match In Auckland, 2020 Latest Sport News, 2020 Latest Sport News And Headlines, India vs New Zealand, India vs New Zealand Match, India vs New Zealand Match Live Updates, latest sports news, latest sports news 2020, Mango News Telugu, sports news

2020 ప్రారంభంలోనే శ్రీలంక, ఆస్ట్రేలియాలపై సిరీస్‌ లు గెలిచిన భారత్ జట్టు మరో ఆసక్తికర పోరుకు సిద్ధమవుతోంది. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 29 వరకు న్యూజిలాండ్‌ లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా ఐదు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు భారత్ ఆడనుంది. ముందుగా జనవరి 24, శుక్రవారం నాడు ఆక్లాండ్ లోని ఈడెన్ పార్క్ వేదికగా జరగనున్న తోలి టీ20లో భారత్ జట్టు న్యూజిలాండ్‌ తో తలపడనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ మ్యాచ్ మొదలవుతుంది. ఇప్పటివరకు న్యూజిలాండ్‌ తో భారత్‌ ఆడిన 11 టీ20 మ్యాచుల్లో కేవలం మూడు మ్యాచుల్లోనే విజయం సాధించింది. అయితే ఈసారి న్యూజిలాండ్‌ తో పోల్చుకుంటే భారత్ జట్టు అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. న్యూజిలాండ్ తో గత రెండు టీ20 సిరీస్లు కోల్పోయిన భారత్ ఈసారి పూర్తీ ఆధిపత్యంతో చెలరేగి సిరీస్ దక్కించుకోవాలని చూస్తుంది.

తుది జట్లు (అంచనా) :

భారత్ జట్టు: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్ / రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, నవదీప్ సైని, జస్ప్రీత్ బుమ్రా

న్యూజిలాండ్ జట్టు: మార్టిన్ గుప్టిల్, కోలిన్ మున్రో, కేన్ విలియమ్సన్ (కెప్టెన్ ), టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), కోలిన్ డి గ్రాండ్‌హోమ్, రాస్ టేలర్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్, స్కాట్ కుగ్లీజ్న్, టిమ్ సౌతీ, బ్లెయిర్ టిక్నర్