కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై జూన్ 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చేపట్టిన నిరసన, ఆందోళన కార్యక్రమంలో రైల్వే పోలీస్ కాల్పుల్లో వరంగల్ జిల్లాకు చెందిన దామెర రాకేష్ మరణించిన విషయం తెలిసిందే. దామెర రాకేష్ మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, రాకేష్ కుటుంబానికి 25 లక్షల పరిహారంతో పాటు, ఆ కుటుంబంలో అర్హులైన వారికి వారి ఆర్హత మేరకు ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇవ్వనున్నట్టు ప్రకటించారు.
ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు దామెర రాకేష్ సోదరుడు దామెర రామ్ రాజు కారుణ్య నియామకానికి అనుమతిస్తూ శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. దామెర రామ్ రాజు విద్యార్హతలకు అనుగుణంగా వరంగల్ జిల్లాలో తగిన ఉద్యోగం ఇచ్చేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని వరంగల్ జిల్లా కలెక్టర్ కు సీఎస్ సోమేష్ కుమార్ ఆదేశాలు ఇచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY