మహారాష్ట్ర రాష్ట్రంలో గత కొన్నిరోజులుగా నెలకున్న రాజకీయ ఉత్కంఠకు తెరదింపుతూ, మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ జూన్ 30న ప్రమాణ స్వీకారం చేసి, బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. కాగా మహారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వం జూలై 4న బలపరీక్షను ఎదుర్కునేందుకు సిద్దమవుతుంది. ఈ నేపథ్యంలో రెండు రోజుల జరిగే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జూలై 3, ఆదివారం ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా ముందుగా స్పీకర్ ఎన్నిక జరగనుంది. స్పీకర్ పదవీకి ప్రభుత్వం నుంచి బీజేపీ ఎమ్మెల్యే రాహుల్ నర్వేకర్, మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) నుంచి శివసేన ఎమ్మెల్యే రాజన్ సల్వి నామినేషన్స్ దాఖలు చేశారు. రేపు స్పీకర్ ఎన్నికకు కోసం ఓటింగ్ జరిగే అవకాశముంది.
మహారాష్ట్ర అసెంబ్లీలో 288 సీట్లు ఉండగా, మెజార్టీ నిరూపించుకోవడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 145. తమకు మొత్తం 170 మంది ఎమ్మెల్యేలు మద్ధతు ఉందని, అసెంబ్లీలో పూర్తి మెజారిటీ ఉందని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే తెలిపారు. కీలకమైన బలపరీక్షలో తమ ప్రభుత్వం నెగ్గుతుందని ధీమా వ్యక్తం చేశారు. బలపరీక్ష దృష్ట్యా గోవాలో మిగిలిన శివసేన అసమ్మతి ఎమ్మెల్యేలు కూడా శనివారం ముంబయికి రానున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఏక్‌నాథ్ షిండేను శివసేన పార్టీలో అన్ని పదవుల నుంచి తొలగిస్తున్నట్టుగా శివసేన పార్టీ అధినేత ఉద్ధవ్ థాకరే ఇప్పటికే ప్రకటించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY