పంజాబ్ లో మార్చి 31 వరకు స్కూళ్ళు, కాలేజీలు మూసేయాలని ఆదేశాలు

Mango News, Punjab, Punjab Coronavirus, Punjab Coronavirus News, Punjab covid restrictions, Punjab Lockdown, Punjab Lockdown News, Punjab schools and colleges closed, Punjab shuts schools, Rising Covid-19 Cases, Schools and Colleges closed, Schools and Colleges closed in Punjab, Schools and Colleges closed in Punjab till March 31, Schools and Colleges closed in Punjab till March 31 Due to Rising Covid-19 Cases, schools to be closed in Punjab, Second wave of Covid-19

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో దేశంలో పలు రాష్ట్రాలు మళ్ళీ ఆంక్షల బాటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్ నేతృత్వంలోని పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో శనివారం నుంచి మార్చి 31 వరకు అన్ని పాఠశాలలు, కళాశాలలను మూసివేయాలని పంజాబ్ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. మెడికల్ మరియు నర్సింగ్ కళాశాలలు మినహా అన్ని విద్యా సంస్ధలను మూసివేయాలని చెప్పారు. అలాగే పంజాబ్ లో 10వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 9 నుంచి జరగాల్సి ఉండగా, మే 4 నుండి మే 24 వరకు జరిగేలా వాయిదావేసినట్టు పేర్కొన్నారు. 12వ తరగతి బోర్డు పరీక్షలు మార్చి 22 న ప్రారంభం కావాల్సి ఉండగా, ఏప్రిల్ 20 నుండి మే 24 వరకు నిర్వహించనున్నట్టు తాజాగా వెల్లడించారు.

పంజాబ్ లో కరోనా పరిస్థితిపై అధికారులతో సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్ సమీక్ష నిర్వహించి, పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న 11 జిల్లాల్లో రాత్రి 9 గంటల నుండి రాత్రి కర్ఫ్యూ విధించాలని నిర్ణయించారు. సినిమా హాళ్లు 50% సీటింగ్ సామర్థ్యంతోనే నడపాలని, అలాగే ఏ సమయంలోనైనా మాల్స్ లో 100 మందికి మించి వ్యక్తులను అనుమతించకూడదని ఆదేశాలు ఇచ్చారు. రెండు వారాల తరువాత మళ్ళీ కరోనా పరిస్థితిని సమీక్షించి, తదుపరి నిర్ణయాలు ప్రకటిస్తామని తెలిపారు. మరోవైపు పంజాబ్ లో ఇప్పటివరకు మొత్తం 2,05,418 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 1,84,848 మంది కరోనా నుంచి కోలుకోగా, 6,204 మంది మరణించారు. ప్రస్తుతం 14,366 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 2 =