పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ గురువారం చండీగఢ్‌లోని తన నివాసంలో 32 ఏళ్ల డాక్టర్ గురుప్రీత్ కౌర్‌ను వివాహం చేసుకున్నారు. వీరి వివాహం చాలా నిరాడంబరంగా జరిగింది. పూర్తి ప్రైవేట్ కార్యక్రమంగా నిర్వహించిన ఈ వివాహ వేడుకకు అతిథులెవరినీ పిలవలేదు. కేవలం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరియు ఆ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా మాత్రమే హాజరయ్యారు. వారు తమ కుటుంబాలతో కలిసి వివాహానికి హాజరయ్యారు. చాలా తక్కువ మంది హాజరైన ఈ వివాహానికి దగ్గరి బంధువులు పాల్గొన్నారు. అయితే భగవంత్ మాన్‌కి ఇది రెండో పెళ్లి. అతని మొదటి భార్య ఇందర్‌జీత్ కౌర్ తో 2015లో విడాకులు తీసుకున్నారు. ఇక 48 ఏళ్ల భగవంత్ మాన్ కు ఫ్యామిలీ పరిచయాల ద్వారా గురుప్రీత్ కౌర్ కొన్నేళ్లుగా తెలుసు. కౌర్ హర్యానాలోని కురుక్షేత్ర జిల్లా పెహోవాకు చెందిన వారు.
సీఎం భగవంత్ మాన్ తల్లి హర్పాల్ కౌర్‌కు గురుప్రీత్ కౌర్ కుటుంబానికి పరిచయం ఉండటంతో.. ఈ వివాహానికి ఇరు వైపులా పెద్దలు అంగీకరించినట్లు మాన్ కుటుంబ సభ్యులు వెల్లడించారు. అలాగే పంజాబ్ ఎన్నికల ప్రచారంలో గురుప్రీత్ కౌర్ కూడా అతనికి సహాయం చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. భగవంత్ మాన్ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించినందున ఆశీర్వదించాడు వచ్చానని తెలిపారు. అలాగే కొత్త జంట వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఇక ఎంపీ రాఘవ్ చద్దా భగవంత్ మాన్ వివాహానికి సంబంధించిన కొన్ని ఫోటోలను తన ట్విట్టర్ లో పంచుకున్నారు. మాన్ సాహెబ్‌కు మిలియన్ అభినందనలు, అని ఆయన ట్వీట్ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ