పాల్ రావాలి-పాలనా మారాలి పేరుతో ఏపీ, తెలంగాణల్లో కేఏ పాల్ యాత్ర, జూలై 9న వైజాగ్ నుంచి ప్రారంభం

Praja Shanti Party President KA Paul to Held Yatra In AP Telangana Starts From July 9th at Vizag, Praja Shanti Party President KA Paul to Held Yatra In AP And Telangana Starts From July 9th at Vizag, Praja Shanti Party President KA Paul to Held Yatra Telangana Starts From July 9th at Vizag, Praja Shanti Party President KA Paul to Held Yatra In AP Starts From July 9th at Vizag, Praja Shanti Party President KA Paul to Held Yatra In AP And Telangana, KA Paul Yatra Starts From July 9th at Vizag, Praja Shanti Party President KA Paul, Praja Shanti Party Chief KA Paul, Praja Shanti Party, KA Paul, Vizag, KA Paul Yatra, Praja Shanti Party Yatra, KA Paul Praja Yatra News, KA Paul Praja Yatra Latest News, KA Paul Praja Yatra Latest Updates, KA Paul Praja Yatra Live Updates, Mango News, Mango News Telugu,

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డా.కేఏ పాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. “పాల్ రావాలి-పాలన మారాలి” పేరుతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో యాత్ర చేపట్టనున్నట్టు తెలిపారు. బుధవారం కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల దాదాపు 20 లక్షల మంది ప్రజాశాంతి పార్టీలో చేరారని చెప్పారు. వారంతా తమ జిల్లాలకు రావాలని కోరిన మేరకు జూలై 9వ తేదిన విశాఖపట్నం జిల్లా నుండి తన యాత్రను ప్రారంభించనున్నట్టు తెలిపారు. జూలై 9 నుంచి జూలై 23 వరకు ఆంధ్రప్రదేశ్ లో, జూలై 23 నుంచి ఆగస్టు 1 వరకు తెలంగాణలోని పాత 10 జిల్లాల్లో తన యాత్ర కొనసాగుతుందన్నారు.

ఈ యాత్రలో భాగంగా ఆయా జిల్లాల్లో ప్రతి మీటింగ్ మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఉంటుందన్నారు. ఈ యాత్ర పబ్లిక్ మీటింగ్స్ కాదు అన్నారు. కొన్ని వందల మంది యూత్ స్టూడెంట్స్, యూత్ లీడర్స్, ప్రొఫెసర్స్, డాక్టర్స్, ఇంజినీర్స్, క్యాస్ట్ లీడర్స్, రాజకీయ నాయకులతో పాటుగా ఎవరైతే మార్పు తేవాలి, మార్పు కావాలి అని కోరుకుంటున్నారో వారందరినీ ఈ యాత్రలో జరిగే కాన్ఫరెన్స్ ల ద్వారా కలుస్తానని చెప్పారు. అదే విధంగా మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలను కూడా ఈ కాన్ఫరెన్స్ లకు ఆహ్వానిస్తున్నామని, ఈ యాత్ర సందర్భంగా పలువురిని పార్టీలో చేర్చుకుంటామని కేఏ పాల్ వెల్లడించారు.

పాల్ రావాలి-పాలన మారాలి యాత్ర వివరాలు:

 • జూలై 9: విశాఖపట్నం
 • జూలై 10: విజయనగరం
 • జూలై 11: శ్రీకాకుళం
 • జూలై 12: కాకినాడ
 • జూలై 13: రాజమండ్రి
 • జూలై 14: ఏలూరు
 • జూలై 15: విజయవాడ
 • జూలై 16: గుంటూరు
 • జూలై 17: ఒంగోలు
 • జూలై 18: నెల్లూరు
 • జూలై 19: చిత్తూరు
 • జూలై 20: కడప
 • జూలై 21: అనంతపూర్
 • జూలై 22: కర్నూల్, హైదరాబాద్
 • జూలై 23: హైదరాబాద్
 • జూలై 24: నల్గొండ
 • జూలై 25: ఖమ్మం
 • జూలై 26: వరంగల్
 • జూలై 27: కరీంనగర్
 • జూలై 28: నిజామాబాదు
 • జూలై 29: ఆదిలాబాద్
 • జూలై 30: మెదక్
 • జూలై 31: రంగారెడ్డి
 • ఆగస్టు 1: మహబూబ్ నగర్

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here