ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వారణాసిలో అక్షయపాత్ర మధ్యాహ్న భోజన వంటశాల (మిడ్-డే మీల్ కిచెన్)ను ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) రెండోసారి ఘన విజయం సాధించిన తర్వాత మొదటిసారి వారణాసి నియోజకవర్గాన్ని సందర్శించారు. ఇక తన పర్యటనలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం కోసం రూ.1,774 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోదీ ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన చేశారు. దీనిలో భాగంగా స్థానిక ఎల్‌టి కళాశాలలో అక్షయపాత్ర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అధునాతన మధ్యాహ్న భోజన వంటశాలను ప్రారంభించారు. ఈ వంటశాలలో సుమారు లక్ష మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండే సామర్థ్యం ఉందని ప్రధాని మోదీ తెలిపారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి ఆయన కొత్తగా ప్రారంభించిన వంటగదిని పరిశీలించారు. గత ఎనిమిదేళ్లుగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. వారణాసి నగరంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, సామాన్యులకు జీవన సౌలభ్యాన్ని పెంపొందించడంపై ఈ ప్రాజెక్టులు కీలకంగా మారనున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం ప్రధాని మోదీ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్-రుద్రాక్ష్‌ను సందర్శించి, అక్కడ జాతీయ విద్యా విధానం అమలుపై అఖిల భారతీయ శిక్షా సమాగమంలో పాల్గొంటున్నారు. అలాగే బీజేపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘నమో ఘాట్’ అభివృద్ధి పనులను కూడా సమీక్షించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY