తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సీఎం వైఎస్ జగన్

AP CM YS Jagan Filed Petition,Mango News,Latest Breaking News 2020,Telangana Political Updates,Telangana High Court,Andhra Pradesh Chief Minister YS Jagan,Andhra Pradesh CM YS Jagan Filed Petition,YS Jagan Mohan Reddy Latest News,Money Laundering Case
అక్రమాస్తుల కేసుకు సంబంధించిన విచారణ సందర్భంగా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను ఇటీవల సీబీఐ న్యాయస్థానం తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో సీఎం వైఎస్ జగన్‌ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ, ఈడీ కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ సీఎం వైఎస్ జగన్‌ తరఫున హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. సీబీఐ కోర్టు తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు నిరాకరించడాన్ని ఆయన సవాల్ చేశారు. ఒక ముఖ్యమంత్రిగా పలు బాధ్యతలు నిర్వహించాల్సి ఉన్నందున కోర్టుకు హాజరు కావడం కుదరదని, అందువలన మినహాయింపు ఇవ్వాలని హైకోర్టును కోరారు. ఈ పిటిషన్ పై త్వరలోనే హైకోర్టులో విచారణ జరగనుంది.

[subscribe]