గులాబ్ తుఫాన్ తో నష్టం, 34586 రైతుల ఖాతాల్లో రూ.22 కోట్లు జమ: సీఎం వైఎస్ జగన్

22 Cr Funds for 34586 Farmers who Lost Crop, 22 Cr Funds for 34586 Farmers who Lost Crop Due to Gulab Cyclone, AP CM YS Jagan, CM Jagan Mohan Reddy, CM YS Jagan, CM YS Jagan Released Rs 22 Cr Funds for 34586 Farmers who Lost Crop, CM YS Jagan Released Rs 22 Cr Funds for 34586 Farmers who Lost Crop Due to Gulab Cyclone, Funds for 34586 Farmers who Lost Crop Due to Gulab Cyclone, Gulab Cyclone, Mango News, YS Jagan Released Rs 22 Cr Funds for 34586 Farmers

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ ‌మోహన్ ‌రెడ్డి మంగళవారం నాడు రాష్ట్రంలో గులాబ్ తుపాను కారణంగా పంట నష్టపోయిన 34,586 మంది రైతులకు నష్టపరిహారం కింద రూ.22 కోట్ల నిధులను విడుదల చేశారు. సెప్టెంబర్, 2021లో వచ్చిన గులాబ్ తుఫాన్ కారణంగా పలు ప్రాంతాల్లో రైతులు నష్టపోగా, నేడు ఆ పంట నష్టపరిహారాన్ని నేరుగా రైతుల ఖాతాల్లో జమచేసే పక్రియను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, రైతులకు ఏ సీజన్ లో జరిగిన నష్టానికి అదే సీజన్ లో పరిహారం చెల్లించేలా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

దేశంలో ఎక్కడాలేని కొత్త సాంప్రదాయానికి ఏపీలో శ్రీకారం చుట్టామన్నారు. రైతులు ఇబ్బంది పడితే గ్రామీణ ఆర్థిక రంగం కుంటుపడుతుందని, రాష్ట్రంలో 62 శాతానికిపైగా మంది వ్యవసాయంపై ఆధార పడ్డారని చెప్పారు. ఈ ప్రభుత్వం రైతుల కోసం తీసుకుంటున్న చర్యలు చరిత్రలో నిలిచిపోతాయని, రైతులకు ఈ ప్రభుత్వం అన్ని వేళలా తోడుగా ఉండాలని మనసా, వాచా, కర్మేణా ప్రతి అడుగూ ముందుకు వేస్తువస్తున్నామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + two =