స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు: ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో మంత్రి తలసాని సమావేశం

Minister Talasani Srinivas Yadav held Meeting with Film Chamber of Commerce Representatives, Telangana Minister Talasani Srinivas Yadav held Meeting with Film Chamber of Commerce Representatives, Talasani Srinivas Yadav held Meeting with Film Chamber of Commerce Representatives, Meeting with Film Chamber of Commerce Representatives, Film Chamber of Commerce Representatives, Representatives Of Film Chamber of Commerce, Film Chamber of Commerce Producers, Telugu Film Chamber of Commerce, Film Chamber of Commerce, Telangana Minister Talasani Srinivas Yadav, Minister Talasani Srinivas Yadav, Talasani Srinivas Yadav, Telangana Minister, Film Chamber of Commerce Producers News, Film Chamber of Commerce Producers Latest News, Film Chamber of Commerce Producers Latest Updates, Film Chamber of Commerce Producers Live Updates, Mango News, Mango News Telugu,

స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను ఆగస్టు 8 నుండి 22 వ తేదీ వరకు అత్యంత ఘనంగా నిర్వహించేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో ఫిల్మ్ డెవలప్మెంట్ శాఖ అధికారులు, ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, తదితరులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు వజ్రోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ వేడుకలలో విద్యార్ధులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, యువతీయువకులు ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేసే విధంగా ఎంతో ఉత్సాహంగా పాల్గొనేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వివరించారు.

ఆగస్టు 15వ తేదీన ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసేలా ఇంటికో జెండాను అందజేయనున్నట్లు చెప్పారు. అందులో భాగంగా విద్యార్ధులు అందరికీ మహాత్మాగాంధీ చరిత్రను తెలియజెప్పే, విద్యార్ధి దశ నుండే దేశభక్తి ని పెంపొందించే విధంగా తెలుగు, హిందీ భాషలలో రూపొందించిన చిత్రాన్ని రాష్ట్రంలోని 2.77 లక్షల సీట్ల సామర్ద్యంతో ఉన్న 563 స్క్రీన్స్ లలో ప్రదర్శించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. విద్యార్ధులను థియేటర్ లకు తీసుకెళ్ళే రవాణా ఏర్పాట్లను కూడా ప్రభుత్వం చేపడుతుందని, అంతేకాకుండా వారికి ఉచితంగా వాటర్ బాటిల్స్, స్నాక్స్ అందించడం జరుగుతుందని చెప్పారు. ఇందులో భాగంగా విద్యాశాఖ అధికారులతో ఒక సమావేశం నిర్వహించి సమీక్షించాలని హోం శాఖ ప్రిన్స్ పల్ సెక్రెటరీ రవిగుప్తాను మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు సునీల్ నారంగ్, కార్యదర్శులు అనుపమ్ రెడ్డి, దామోదర్ ప్రసాద్, ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అద్యక్షులు బసిరెడ్డి, ఎఫ్డీసీ ఈడీ కిషోర్ బాబు, యూఎఫ్ఓ, క్యూబ్ ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY