కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయిన హోంమంత్రి మహమ్మద్ అలీ

Home Minister Mahmood Ali Discharged, Mahmood Ali Discharged, Mahmood Ali Discharged After Covid-19 Treatment, Telangana Home Minister Mahmood Ali, Telangana Home Minister Mahmood Ali Tested Positive, Telangana State Home Minister

తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్‌ అలీ కి ఇటీవల కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా కరోనాకు చికిత్స పొందుతున్న ఆయన జూలై 3, శుక్రవారం నాడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మంత్రితో పాటు ఆయన కుమారుడు, మనుమడు కూడా డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ తన ఆరోగ్యం పట్ల వాకబు చేసిన, ప్రార్థనలు చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, మంత్రులు కెటి రామారావు, హరీష్ రావు, పార్లమెంటు సభ్యులు జె.సంతోష్ కుమార్, కె.కేశవ రావు, మాజీ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవితలకు ధన్యవాదాలు తెలియజేశారు.

ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఫోను ద్వారా పరామర్శించిన ఉపరాష్ట్రపతికి, రాష్ట్ర గవర్నర్ కు, రాష్ట్ర మంత్రులకు, ప్రజాప్రతినిధులకు, అన్ని పార్టీల నాయకులకు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. తనకు చికిత్స అందించిన అపోలో ఆసుపత్రి వైద్యులకు, సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా కరోనా వ్యాధి పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స పొందాలని, జాగ్రత్తగా ఉండాలని, భయపడవద్దని సూచించారు. చల్లటి నీరు తాగవద్దని, ఇంటి భోజనం మాత్రమే చేయాలని, అదేవిధంగా వ్యాయామం పట్ల శ్రద్ధ వహించాలని, భౌతిక దూరం పాటించాలని, మాస్కు ధరించాలని మంత్రి సూచించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here