సికింద్రాబాద్‌ లో అగ్నిప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Union Minister Kishan Reddy Visited the Site of Blaze Mishap in Ramgopalpet Secunderabad,Union Minister Kishan Reddy,Visited the Site of Blaze Mishap,Ramgopalpet,Secunderabad,Mango News,Mango News Telugu,Hyderabad 4 Rescued,3 People Missing,Massive Fire Breaks Out,Sports Material Building at Secunderabad,Sports Material Building Secunderabad,Hyderabad Fire Accident Today,Hyderabad Hotel Fire Accident,Fire Accident In Hyderabad Today 2023,Car Fire Accident In Hyderabad,Fire Accident In Secundrabad,Hyderabad Club Fire Accident,Hyderabad Bus Fire Accident,Fire Accident In Hyderabad Secundrabad,Fire Accident In Hyderabad,Hyderabad Car Fire Accident

సికింద్రాబాద్‌, రాంగోపాల్‌పేట పరిధిలోని నల్లగుట్ట ప్రాంతంలో స్పోర్ట్స్‌, కారు డెకర్స్‌ సామగ్రికి సంబంధించిన ఆరు అంతస్థుల భవనంలో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాద ఘటనలో నలుగురిని రక్షించగా, మరో ముగ్గురు ఆచూకీ లభించకపోవడంతో వాళ్ల కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా ఈ అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశాన్ని శుక్రవారం ఉదయం సికింద్రాబాద్ ఎంపీ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. ప్రమాదం జరిగిన భవనం, చుట్టూ పక్కల ప్రాంతాలు పరిశీలించి అధికారులతో మాట్లాడి ఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. తరువాత అక్కడి నుంచి తరలించిన వారితో, పొరుగు నివాసితులతో సంభాషించి వారి క్షేమం, భద్రత గురించి కనుక్కున్నారు. అలాగే అక్కడ చేపడుతున్న సహాయకచర్యలపై పోలీసు అధికారులకు, అగ్నిమాపక సిబ్బందికి కిషన్ రెడ్డి పలు సూచనలు చేశారు. మరోవైపు బిల్డింగ్ ఓనర్‌లు మరియు సంబంధిత వ్యక్తులు తమ ప్రాంగణంలో క్రమం తప్పకుండా భద్రతా తనిఖీలు చేయాలని కిషన్ రెడ్డి కోరారు.

ముందుగా సికింద్రాబాద్‌ లో జరిగిన అగ్ని ప్రమాదంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తూ, ముగ్గురు యువకులు అదృశ్యం కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని అన్నారు. ఫైర్ సేఫ్టీ ప్రోటోకాల్‌లను పటిష్టంగా అమలు చేసేలా సంబంధిత అధికారులతో సమీక్ష జరుపుతానని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × three =