కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెట్టడాన్ని స్వాగతించండి, ఆ ప్రాంత నేతలకు ముద్రగడ పద్మనాభం లేఖ

AP Mudragada Padmanabham Writes Letter To Konaseema Leaders For Welcoming Named Dr Ambedkar District, Mudragada Padmanabham Writes Letter To Konaseema Leaders For Welcoming Named Dr Ambedkar District, Former minister and Kapu movement leader Mudragada Padmanabham, Mudragada Padmanabham has once again started writing letters, AP Mudragada Padmanabham Writes Letter To Konaseema Leaders, Padmanabham Writes Letter To Konaseema Leaders, Welcoming Named Dr Ambedkar District, Dr Ambedkar District, Konaseema Leaders, Kapu movement leader Mudragada Padmanabham, Former minister Mudragada Padmanabham, Kapu movement leader, Mudragada Padmanabham, AP Ambedkar District News, AP Ambedkar District Latest News, AP Ambedkar District Latest Updates, AP Ambedkar District Live Updates, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని నెలల క్రితం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల ప్రక్రియలో కోనసీమ జిల్లా పేరుపై వివాదం రేగిన సంగతి తెలిసిందే. జిల్లా పేరు మార్పు నేపథ్యంలో కోనసీమ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికీ కొంతమంది అభ్యంతరం వ్యక్త చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. కోనసీమ జిల్లాకు డా. బీఆర్‌ అంబేడ్కర్‌ పేరు పెట్టడంపై మాజీ మంత్రి, ప్రముఖ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం స్పందించారు. ఈ మేరకు ఆయన కోనసీమ జిల్లా ముఖ్యనేతలకు బహిరంగ లేఖ రాశారు. డా. అంబేడ్కర్‌ పేరును జిల్లా వాసులు స్వాగతించాలని ముద్రగడ పిలుపునిచ్చారు.

కోనసీమ ప్రాంతంలో జరుగుతున్న సంఘటనలపై విచారం వ్యక్తం చేసిన ముద్రగడ పద్మనాభం.. ప్రజలంతా సోదర భావంతో మెలగవలసిన సమయంలో ఇలా కులాలు, మతాలు అంటూ కొట్టుకోవడం తనను బాధించిందని తెలిపారు. ఇక న్యాాయంగా అయితే దివంగత మాజీ లోక్‌సభ స్పీకర్ జి.యమ్.సి బాలయోగి గారి పేరు పెట్టాలని, ఎందుకంటే బాలయోగి లోక్‌సభ స్పీకర్ అయిన తర్వాతే కోనసీమ ప్రాంతం అభివృద్ధి చెందిందని తెలిపారు. అయినా బాబాసాహెబ్ అంబేడ్కర్‌ను భారతదేశం లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కొనియాడుతారని, అలాంటి మహనీయుడి పేరు కోనసీమకు పెట్టినందుకు అందరూ గర్వపడాలి పేర్కొన్నారు. డా. అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగం వలనే మనమంతా ఇప్పుడు స్వేచ్చగా జీవిస్తున్నామని గుర్తుంచుకోవాలని హితవు పలికారు.

భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు ఆంగ్లేయుడైన కాటన్ ధవళేశ్వరంలో గోదావరికి ఆనకట్ట కట్టించారని ఆ ప్రాంత ప్రజలు ఆయనను ఇప్పటికీ స్మరించుకుంటున్నారని, వారి కుటుంబ సభ్యులు ధవళేశ్వరం వస్తే ఎంతగానో గౌరవిస్తున్నారని ముద్రగడ లేఖలో గుర్తు చేశారు. పరాయి దేశం వారినే ఆదరించగా లేనిది, ఈ దేశంలో పుట్టి అందరికి హక్కులు కల్పిస్తూ రాజ్యాంగం రాసిన డా. అంబేడ్కర్ గారిని గౌరవించుకోవడంలో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. ఇకనైనా విశాల దృక్పథంతో అలోచించి కోనసీమ పెద్దలతో పాటు ప్రజాప్రతినిధులు వివాదాన్ని ముగించాలని, సమస్యను పరిష్కరించడానికి అన్ని వర్గాల నేతలు ముందుకు రావాలని ఆయన లేఖలో విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో జిల్లా నాయకులు మంత్రి పినిపే విశ్వరూప్‌, ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్‌, కుడుపూడి సూర్యనారాయణ రావు, కల్వకొలను తాతాజీ వంటివారు చొరవ చూపి వివాదాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని ముద్రగడ పద్మనాభం కోరారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + two =