తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో ఆగస్టు 11, గురువారం మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ కేబినేట్ సమావేశం సందర్భంగా రాష్ట్రానికి అదనపు వనరుల సమీకరణ, తదితర అంశాల మీద చర్చించనున్నారు. ఈ మేరకు తెలంగాణ సీఎంవో కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
ఇటీవల ప్రభుత్వ బాండ్ల జారీతో తీసుకునే రుణాల్లో కేంద్రం కోత విధించిన నేపథ్యంలో అదనపు వనరుల సమీకరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించినట్టు తెలుస్తుంది. అలాగే రాష్ట్రంలో జరుగుతున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాలు, కొత్త పెన్షన్ల మంజూరు, మునుగోడు ఉపఎన్నికపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY