తెలంగాణ గవర్నర్ గా తమిళిసై సౌందరరాజన్

Governor Tamilisai Soundararajan, Mango News Telugu, Soundararajan Appointed As Telangana New Governor, Soundararajan Appointed As Telangana State New Governor, Tamilisai Soundararajan, Tamilisai Soundararajan Appointed As Telangana State New Governor, Telangana New Governor, Telangana Political Live Updates, Telangana Political Updates, Telangana Political Updates 2019, Telangana State New Governor

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా తమిళనాడుకు చెందిన తమిళిసై సౌందర రాజన్ నియమితులయ్యారు. తెలంగాణ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను బదిలీ చేస్తూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్ గా తమిళిసై సౌందర రాజన్ ను నియమిస్తున్నట్టు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేసారు. ఆమె ప్రస్తుతం తమిళనాడు బీజేపీ చీఫ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తెలంగాణకే కాకుండా మరో ఐదు రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. బీజేపీ సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా నియమించారు. హిమాచల్ ప్రదేశ్ లో ఇప్పటివరకు బాధ్యతలు నిర్వహిస్తున్న కల్ రాజ్ మిశ్రా ను రాజస్థాన్ కు బదిలీ చేసారు. మహారాష్ట్ర కు భగత్‌సింగ్‌ కోశ్యారీ, కేరళ రాష్ట్రానికి మహ్మద్ ఖాన్ ను గవర్నర్లుగా నియమించారు.

తెలంగాణ రాష్ట్రానికి తోలి మహిళా గవర్నర్ గా తమిళిసై సౌందర రాజన్ నియామకం అవ్వడం విశేషం. వైద్య వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఆమె అనతికాలంలోనే తమిళనాడులో అగ్రశ్రేణి మహిళా నేతగా ఎదిగారు. 2014 నుంచి తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. తెలంగాణ కు గవర్నర్ గా రావడం సంతోషంగా ఉందని, పదవి ఇచ్చిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ , ప్రధాని నరేంద్రమోడీ కి కృతజ్ఞతలు తెలిపారు. గవర్నర్ గా సమర్థవంతంగా విధులు నిర్వహించి, తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం నాడు ఆమెతో ఫోన్ లో మాట్లాడారు, ఆమెకు శుభాభినందనలు తెలియజేసి రాష్ట్రానికి సాదరంగా ఆహ్వానించారు.

 

[subscribe]
[youtube_video videoid=4lu1G2OCC_Y]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − one =