సూర్యాపేటలో‌ కబడ్డీ పోటీల్లో అపశ్రుతి, గ్యాలరీ కుప్పకూలడంతో పలువురికి గాయాలు

Disagreement At Suryapeta National Kabaddi Competition, Disruption in Suryapeta National Kabaddi, Gallery Collapsed at Junior National Kabaddi Competitions, Gallery Collapsed at Junior National Kabaddi Competitions at Suryapet, Gallery collapses during Kabaddi match, Junior National Kabaddi Competitions, Mango News, Suryapet Kabaddi Incident, Suryapeta National Kabaddi, telangana

సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరుగుతున్న 47వ జాతీయ జూనియర్‌ కబడ్డీ క్రీడల ప్రారంభోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఒక్కసారిగా గ్యాలరీ కూలిపోవడంతో పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మైదానంలో ఏర్పాటు చేసిన గ్యాలరీలో ప్రేక్షకులు సామర్థ్యానికి మించి కూర్చోవడంతో గ్యాలరీ కుప్పకూలినట్టు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో ప్రేక్షకులకు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో గ్యాలరీలో దాదాపు 1500 మంది ప్రేక్షకులున్నట్టు సమాచారం.

జాతీయ కబడ్డీ క్రీడల కోసం 3 గ్యాలరీలు ఏర్పాటు చేయగా, ఒక్కో గ్యాలరీలో 5 వేల మంది కూర్చునేలా ఏర్పాటు చేశారు. కబడ్డీ క్రీడల కోసం పలు రాష్ట్రాల నుంచి క్రీడాకారులు రాగా, మరికాసేపట్లో ప్రారంభోత్సవం జరుగుతుందనగా ఊహించని ఘటన జరగడంతో అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి వెళ్లి గాయపడిన వారిని పరామర్శించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 5 =