ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతలపై లీగల్ యాక్షన్ కు సిద్దమైన ఆయన ఈ క్రమంలో వారిపై దావా వేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు తనపై ఆప్ నాయకులు.. సౌరభ్ భరద్వాజ్, అతిషి, దుర్గేష్ పాథక్ మరియు జాస్మిన్ షాలు పరువు నష్టం కలిగించే తప్పుడు ఆరోపణలకు పాల్పడ్డారని తెలుపుతూ వారిపై చట్టపరమైన చర్యలను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఇది కేవలం రూ. 17 లక్షల రూపాయల స్కామ్ కేసు అని, అయితే ఆప్ నాయకులు దీనిని రూ. 1400 కోట్లు స్కామ్ అని ప్రచారం చేస్తున్నారని సక్సేనా మండిపడ్డారు.
కాగా 2016 డీమోనిటైజేషన్ ప్రక్రియలో నాడు ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమీషన్ ఛైర్మన్ గా ఉన్న నేటి లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా స్కామ్‌కు పాల్పడ్డారని ఆప్ ఆరోపించింది. న్యూఢిల్లీలోని ఖాదీ గ్రామోద్యోగ్ భవన్ (కెజిబి) ఖాతాల్లో కొన్ని డిమోనిటైజ్ చేయబడిన నోట్లు వివిధ తేదీల్లో జమ చేయబడ్డాయని, దీనిలో సక్సేనా హస్తం ఉందని ఆప్ నేతలు ఆరోపించారు. ఈ స్కామ్ విలువ సుమారు రూ. 1400 కోట్లుగా ఉంటుందని తెలిపింది. అంతేకాకుండా అతనిపై సీబీఐ విచారణ చేపట్టాలని కూడా డిమాండ్ చేసింది. అయితే కెవిఐసి ఆదేశాల మేరకు సిబిఐ ఇప్పటికే కేసు దర్యాప్తు చేసి ఛార్జిషీట్ దాఖలు చేసింది. ప్రస్తుతం ఇది కోర్టులో పెండింగులో ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ