దేశ చరిత్రలో ఒకే ఒక్కడు సీఎం కేసీఆర్, బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రశంసలు

CM KCR is the Unique Leader in the History of the Country Bihar CM Nitish Kumar, Telangana CM KCR Meets Nitish Kumar, Nitish Kumar Praises CM KCR, Telangana CM KCR Bihar Tour, Mango News, Mango News Telugu, CM KCR Latest News And Updates, Telangana CM KCR, Bihar CM Nitish Kumar, Telangana CM KCR Speech Live Updates, Telangana CM KCR Unique Leader Bihar CM, Nitish Kumar Janata Dal Party,

ఒక రాష్ట్రం కోసం ఉద్యమించి, రాష్ట్రాన్ని సాధించి, అనతి కాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి రోల్ మోడల్ గా నిలిపిన సీఎం కేసీఆర్ ఒకే ఒక్కడిగా చరిత్రలో నిలిచిపోతారని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అన్నారు. నూతన తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న ప్రగతిని బీహార్ సీఎం నితీష్ కుమార్ కొనియాడారు. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు భారతదేశానికి మార్గదర్శనంగా నిలిచాయని నితీష్ కుమార్ అన్నారు. ఆదివారం సీఎం కేసీఆర్ బీహార్ పర్యటన సందర్భంగా పాట్నాలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో సీఎం నితీష్ కుమార్ మాట్లాడుతూ, “తెలంగాణ సీఎం కేసీఆర్ కు అపూర్వ స్వాగతం. సీఎం కేసీఆర్ ఇక్కడకి వచ్చేందుకు సమయం కేటాయిచండం చాలా సంతోషకరం. గాల్వాన్ లోయ అమరవీరులకు రూ.10 లక్షలు, హైదరాబాద్ దుర్ఘటనలో మరణించిన కార్మికులకు రూ.5 లక్షలు తెలంగాణ ప్రభుత్వం ఆర్ధిక సహాయంగా అందించడం గొప్ప విషయం. తెలంగాణ ప్రభుత్వం కరోనా సమయంలో బీహార్ వాసులను తరలించేందుకు ప్రత్యేక ట్రైన్లను ఏర్పాటు చేయడం వారి ఉదారతకు తార్కాణం. తెలంగాణ ప్రభుత్వం అమలుపరిచిన కార్యాచరణను మరే ప్రభుత్వం చేయలేదు” అని అన్నారు.

“తెలంగాణ ఏర్పాటు కోసం సీఎం కేసీఆర్ 2001 నుంచి ఉద్యమించారు. ప్రాణాలకు తెగించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు. అనంతరం వచ్చిన ఎన్నికల్లో ప్రజల దీవెనలతో విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో, వికాసంలో సీఎం కేసీఆర్ భాగస్వామ్యం ఎంతో గొప్పది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలకు తెగించి పోరాడి, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి, అనతి కాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రపథంలో నిలిపిన సీఎం కేసీఆర్ ఒకే ఒక్కడిగా చరిత్రలో నిలిచిపోతారు. తెలంగాణ రాష్ట్ర ప్రగతి కోసం అహరహం శ్రమిస్తున్న గొప్ప సీఎం కేసీఆర్. మిషన్ భగీరథ పథకం గొప్ప పథకం. మిషన్ భగీరథ ద్వారా తెలంగాణలోని గ్రామ గ్రామానికి మంచినీటిని అందించడం చాలా గొప్ప కార్యం. తెలంగాణ ఇచ్చిన సీఎంను ప్రజలు వదులుకోరు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ప్రేరణతో బీహార్ లో నీటి సమస్యను త్వరలోనే అధిగమిస్తాం. ఎప్పటిదాకా వ్యవసాయోగ్యమైన భూమి, పచ్చదనం ఉంటుందో అప్పుడే సమాజం వర్ధిల్లుతుంది. ప్రజా సంక్షేమం, రాష్ట్ర ప్రగతి కోసం అసాధ్యాలను సుసాధ్యం చేయడం కేసీఆర్ కే సాధ్య మైంది. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం రాష్ట్రాలకు అందే నిధులకు కోత పెడుతున్నది” అని సీఎం నితీష్ కుమార్ అన్నారు.

“ప్రత్యేక రాష్ట్ర హోదా లభించి ఉంటే బీహార్ చాలా గొప్పగా ఉండేది. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం రాష్ట్రాలకు అందే నిధులకు కోత పెడుతున్నది. ప్రత్యేక రాష్ట్ర హోదా లభించి ఉంటే బీహార్ చాలా గొప్పగా ఉండేది. రాష్ట్రాల అభివృద్దే దేశాభివృద్ధి అనే విషయాన్ని కేంద్రం మరిచింది. నాకు హైదరాబాద్ తో అవినాభావ సంబంధం ఉంది. అటల్ బీహార్ వాజ్ పేయ్ నేతృత్వంలో బీహార్ ప్రభుత్వం బాగా పనిచేసింది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ చాలా గొప్పగా అభివృద్ధి చెందుతున్నది. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సహాయానికి మరోమారు అభినందనలు” అని సీఎం నితీష్ కుమార్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా బీహార్ సీఎం నితీష్ కుమార్ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి మాట్లాడుతూ,“మీ గురించి అవగాహన లేని వారే మీ గురించి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. మీరు వారి విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఆత్మస్టైర్యం కోల్పోకుండా పట్టుదలతో ముందుకు కొనసాగండి. మీ భాగస్వామ్యం చాలా గొప్పది. మీ ద్వారా తెలంగాణ అనే ఒక రాష్ట్రమే ఏర్పడింది. ఈ దేశంలో ఈ రకంగా పోరాటాలు చేసి రాష్ట్రాన్ని సాధించిన చరిత్ర మరెక్కడా లేదు. అలా ఒక రాష్ట్రాన్ని సాధించిన వారు మీరు ఒకే ఒక్కరు. మీరు ఒక రాష్ట్రాన్ని సాధించిన మహా నేత. అలాంటి మీ మీద ఎవరెవరో ఏదేదో మాట్లాడుతుంటారు. వాళ్ళ విమర్శలన్నీ ఫాల్తు మాటలు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మిమ్మల్ని తెలంగాణ ప్రజలు ఎలా వదులుకుంటారు. వదులుకునే ప్రసక్తే ఉండదు. మీరు పట్టువదలకుండా మరింత శక్తి కూడగట్టుకొని మీ రాష్ట్రాభివృద్ధిని కొనసాగించండి” అని అన్నారు.

మరోవైపు ఈ పర్యటనలో భాగంగా బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అగ్రనేత లాలూ ప్రసాద్ యాదవ్ ను సీఎం కేసీఆర్ కలిసి ఆయన ఆరోగ్య యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇటీవలే అనారోగ్యం నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ కోలుకున్నారు. ఈ సందర్భంగా గతంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ఉద్యమానికి లాలూ అండగా నిలిచిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. అలాగే పాట్నాలోని సిక్కు మతస్తుల పుణ్యస్థలం గురు గోవింద్ సింగ్ జన్మస్థలం పాట్నా గురుద్వారను సీఎం కేసీఆర్ దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 4 =