ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు శుభవార్త.. భారీగా తగ్గిన కమర్షియల్‌ సిలిండర్‌ ధర

India Commercial LPG Cylinder Price Reduced by Rs 91.50 New Rates Effective From Today, LPG Cylinder Price Reduced Rs 91.50, India Commercial LPG Cylinder, New Rates Effective From Today, LPG Cylinder Price Reduced, Mango News, Mango News Telugu, Commercial LPG Price Cut By Rs 91.5, LPG Cylinder, LPG Cylinder Reduced Rs 91.50, LPG Cylinder Live News And Updates, India News , LPG News And Live Updates

దేశవ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల వినియోగదారులకు పెట్రోలియం మార్కెటింగ్ కంపెనీలు గురువారం శుభవార్త వినిపించాయి. ఈ మేరకు నేటినుంచి లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) 19 కేజీల వాణిజ్య సిలిండరుపై రూ. 91.50 రూపాయల ధర తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు గ్యాస్ మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. తగ్గించినన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొన్నాయి. కంపెనీల తాజా నిర్ణయంతో రాజధాని నగరం ఢిల్లీలో నిన్నటివరకు రూ.1976.07గా ఉన్న వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధర నేడు రూ.1885కు తగ్గింది. అలాగే ఇతర మెట్రో సిటీలైన ముంబైలో రూ.1844, కోల్‌కతాలో 1995.50, చెన్నైలో రూ.2045గా ఉన్నాయి.

ఇక హైదరాబాద్‌లో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.2099.5కు తగ్గింది. కాగా కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరలు తగ్గడం జూన్‌ తర్వాత ఇది నాలుగోసారి కావడం గమనార్హం. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధర రూ. 90 పైగా తగ్గడంతో రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, టీస్టాళ్ల నిర్వాహకులకు కొంత ఊరట లభించింది. గ్యాస్ మార్కెటింగ్ కంపెనీలు తీసుకున్న ఈ నిర్ణయంతో వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రూ. 90కు పైగా తగ్గినందున తమకు కొంచెం ఉపశమనం కలుగనుందని చెప్పారు. అయితే గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల గ్యాస్‌ సిలిండర్‌ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు ప్రకటించలేదు కంపెనీలు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × four =