తెలంగాణలోని మెడికల్ కాలేజీలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ కూడా మంజూరు చేయకుండా, ఏర్పాటైన అన్నిటికీ తామే తెచ్చామని కిషన్ రెడ్డి చెప్పుకోవడం హాస్యాస్పదమని మంత్రి అన్నారు. ఎయిమ్స్ ఆస్పత్రిని కేవలం ఇచ్చామని చెప్పుకోవడానికే ఏర్పాటు చేశారని.. కానీ అక్కడ ఆపరేషన్ థియేటర్, ఆక్సిజన్ సదుపాయం సహా కనీసం బ్లడ్ బ్యాంక్ కూడా లేవని మండిపడ్డారు. కేంద్రం నిర్లక్ష్యానికి ఎయిమ్స్ వైద్య విద్యార్థుల భవిష్యత్ పాడవకూడదని భావించిన రాష్ట్ర ప్రభుత్వం భువనగిరి ఆస్పత్రిలో ప్రాక్టీస్ చేసుకునేందుకు అనుమతిచ్చిందని గుర్తు చేశారు. మీరు మంజూరు చేయించి తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలు ఎక్కడ ఉన్నాయో పేపర్స్ చూపించాలని హరీష్ రావు సవాల్ చేశారు.
అసలు తెలంగాణలోని మెడికల్ కాలేజీలకు కేంద్రం ఒక్క రూపాయి కూడా సహాయం అందించలేదని, కానీ కేంద్రమంత్రులు మాత్రం కోట్లు ఇచ్చినట్లు అసత్యాలు చెప్తున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు కొత్తగా 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే, తెలంగాణకు ఒక్క కాలేజీ కూడా మంజూరు చేయలేదని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కేంద్రం మెడికల్ కాలేజీలు మంజూరు చేయకపోయినా సీఎం కేసీఆర్ జిల్లాకో కాలేజీ పెట్టాలని నిర్ణయించుకున్నారని, నర్సింగ్ కాలేజీల సంఖ్యను 19కి పెంచుకున్నామని తెలిపారు. నేడు తెలంగాణాలో మెడికల్ కాలేజీలు, మెడికల్ సీట్లు పెరిగాయంటే అందుకు కారణం సీఎం కేసీఆర్ అని వెల్లడించారు. ఈ విద్యాసంవత్సరం కొత్తగా 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 1200 మందికి కొత్తగా అడ్మిషన్లు వచ్చాయని, దేశ చరిత్రలోనే ఇంత భారీ సంఖ్యలో సీట్లు రావడం తొలిసారని చెప్పారు. అలాగే జిల్లాల్లో స్పెషల్ టీమ్స్‌తో ప్రైవేట్ ఆస్పత్రుల్లో తనిఖీలు చేస్తున్నామని, ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న దాదాపు 100కి పైగా ఆస్పత్రులు సీజ్ చేశామని, మరో 600కు పైగా ఆస్పత్రులకు నోటీసులు ఇచ్చామని మంత్రి మంత్రి హరీష్ రావు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY