నాగార్జునసాగర్ ఉపఎన్నిక: నామినేషన్ దాఖలు చేసిన జానారెడ్డి, నోముల భగత్, రవికుమార్

BJP and TRS draw battlelines for Nagarjuna Sagar byelection, BJP Candidates, BJP Candidates Filed Nomination, Congress, Mango News, Mango News Telugu, Nagarjuna Sagar, Nagarjuna Sagar Assembly By-election, Nagarjuna Sagar Assembly By-election Latest News, nagarjuna sagar by election trs candidate, Nagarjuna Sagar By-election, Nagarjuna Sagar Elections, Nagarjunasagar Assembly bypoll, TRS, TRS BJP announce candidates for Nagarjuna Sagar bypoll

నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ నేటితో(మార్చి 30, మంగళవారం) ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు మంగళవారం నాడు నామినేషన్ దాఖలు చేశారు. టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ కుమార్ నిడ‌మ‌నూరు ఆర్వో కార్యాల‌యంలో నామినేషన్ దాఖ‌లు చేశారు. నోముల భగత్ నామినేషన్ కార్యక్రమంలో మంత్రులు జగదీష్ రెడ్డి, మ‌హ‌ముద్ అలీ, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, ఎమ్మెల్యేలు బొల్లం మ‌ల్ల‌య్య యాద‌వ్, భాస్క‌ర్ రావు, ఎమ్మెల్సీ తేరా చిన్న‌ప రెడ్డి, ఎంసి కోటిరెడ్డితో పాటుగా ప‌లువురు నాయ‌కులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జానారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. జానారెడ్డి నామినేషన్ కార్యక్రమానికి పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఇక బీజేపీ అభ్యర్థి డాక్టర్‌ పానుగోతు రవి కుమార్‌ కూడా నిడ‌మ‌నూరు ఆర్వో కార్యాల‌యంలో నామినేషన్ దాఖ‌లు చేశారు. ఈ కార్యక్రమంలో రవి కుమార్ తో పాటుగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొన్నారు. మరోవైపు నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరితేదీగా ఏప్రిల్‌ 3 ను నిర్ణయించారు. ఏప్రిల్‌ 17న ఉపఎన్నిక పోలింగ్ నిర్వహించి, మే 2న ఫలితాలను వెల్లడించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − eleven =