మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక నవంబర్ 3న జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ సహా పలు పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. కాగా మునుగోడు ఉపఎన్నికలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కూడా పోటీలో ఉండనున్నట్టు గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే మునుగోడులో పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయించుకుందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బక్కని నర్సింహులు ప్రకటించారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
“మునుగోడు ఉపఎన్నికలో పోటీకి దూరంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు, అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఉపఎన్నికలో పోటీకి దూరంగా ఉండాలని, పార్టీ సంస్థాగత నిర్మాణంపైనే దృష్టి పెట్టాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించడం జరిగింది” అని బక్కని నర్సింహులు ప్రకటనలో పేర్కొన్నారు. కాగా గతంలో జరిగిన సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు టీడీపీ అభ్యర్థిగా చావా కిరణ్మయి పోటీలో ఉన్న విషయం తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY