నేటితో ముగియనున్న మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం, రోడ్‌ షోల్లో పాల్గొనున్న మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌ రావు

Munugode By- Poll Ministers KTR and Harish Rao To Participates in Several Road Shows of Last Day Campaign Today, Munugode By- Poll Ministers KTR, Ministers Harish Rao, Munugode By- Poll Last Day Campaign, Mango News, Mango News Telugu, Munugode By-Poll, TRS Party Munugode By-Poll, Munugode Bypoll Elections, Munugode Bypoll, CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP , Munugode By Polls, Munugode Election Schedule Release, Munugode Election, Munugode Election Latest News And Updates

మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించిన ప్రచారం నేటి సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, తన్నీరు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో సహా పలువురు మంత్రులు ప్రచారం నిర్వహించనున్నారు. నారాయణపూర్ మండల కేంద్రంలో నిర్వహించే రోడ్‌ షోలో మంత్రి కేటీఆర్, అలాగే మునుగోడు పట్టణంలో జరుగనున్న రోడ్ షోలో పాల్గొననున్నారు. ఇక మంత్రి కేటీఆర్ చివరిసారిగా అక్టోబరు 23న ఘట్టుప్పల్‌లో ప్రచారం చేయగా, హరీశ్‌ రావు అక్టోబర్‌ 26న ప్రచారం నిర్వహించారు. అనంతరం ప్రగతి భవన్‌, తెలంగాణ భవన్‌ వేదికలుగా వివిధ వర్గాల ఓటర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న పలు సామజికవర్గ కీలక నేతలతో సమావేశాలు నిర్వహించారు.

ఈ క్రమంలో ప్రచారానికి చివరిరోజైన మంగళవారం నేరుగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. మునుగోడులోని 2.4 లక్షల మంది ఓటర్లలో దాదాపు సగానికి పైగా ఉన్న 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు గల యువ ఓటర్లను తొలిసారిగా ఆకర్షించేందుకు ప్రత్యేకంగా రోడ్ షోలు నిర్వహించాలని స్థానిక నేతల కోరిక మేరకు కేటీఆర్ నేడు అక్కడ ప్రచారం చేస్తున్నారు. మునుగోడు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పాల్గొన్న బహిరంగ సభ ఆ పార్టీ అవకాశాలను పెంచిందని, ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థి విజయం ఖరారైందని మంత్రి హరీశ్‌ రావు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇక కమ్యూనిస్టు ఓటు బ్యాంకును టీఆర్‌ఎస్‌కు బదిలీ చేసేందుకు హరీశ్‌ రావు వామపక్షాల ఎన్నికల ఇంచార్జ్‌లు, బూత్‌ ఇంచార్జ్‌లతో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని జిల్లా పార్టీ నాయకులు కోరారు.

ఇక వీరితో పాటు ఇతర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు కూడా మునుగోడులో పర్యటిస్తున్నారు. ప్రచార ర్యాలీలతో పాటు వివిధ కూడళ్ల వద్ద ఏర్పాటుచేస్తున్న బహిరంగ సభల్లో ప్రసంగిస్తున్నారు. మొత్తానికి అధికార టీఆర్ఎస్ మునుగోడులో చివరిరోజు ప్రచారాన్ని హోరెత్తించనుంది. కాగా నేటి సాయంత్రం 6గంటల తర్వాత ప్రచారానికి వచ్చిన స్థానికేతరులు నియోజకవర్గంలో ఉండకూడదని, ఇక్కడినుంచి వెళ్లిపోవాలని ఎన్నికల ప్రధానికారి వికాస్‌ రాజ్‌ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో.. ఈలోపు ప్రధాన మండలాల్లో మంత్రులు విస్తృతంగా ప్రచారం నిర్వహించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × four =