మహిళల టీ20 ఆసియా కప్ 2022: సెమీఫైనల్లో థాయ్‌లాండ్‌పై ఘనవిజయం, ఫైనల్ చేరిన టీమిండియా

Women's T20 Asia Cup 2022 India Defeats Thailand by 74 Runs in Semi Final To Enter Finals, Women's T20 Asia Cup 2022, India Defeats Thailand by 74 Runs, T20 Asia Cup 2022 India Defeats Thailand, Mango News, Mango News Telugu, India Vs Thailand, India Vs Thailand T20 Asia Cup 2022, India Vs Thailand Semi Final To Enter Finals, T20 Asia Cup 2022, India Beat Thailand By 74 Runs, IND-W vs THA-W Highlights, Women's T20 Asia Cup, India vs Thailand, Women's T20 Asia Cup Latest News And Updates

మహిళల టీ20 ఆసియా కప్‌లో టీమిండియా ఫైనల్ చేరింది. థాయ్‌లాండ్‌తో గురువారం (13 అక్టోబర్‌, 2022) జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. లీగ్‌ స్టేజ్‌లో జరిగిన ఆరు మ్యాచ్‌ల్లో 5 విజయాలతో టాప్‌లో నిలిచిన హర్మన్‌ ప్రీత్‌ సేన అదే ఊపులో సెమీఫైనల్లో థాయ్‌లాండ్‌ను చిత్తుగా ఓడించింది. 149 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన థాయ్‌లాండ్‌ జట్టు పూర్తి ఓవర్లు ఆడి 9 వికెట్లు కోల్పోయి కేవలం 74 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో భారత్ 74 పరుగుల తేడాతో గెలుపొంది సగర్వంగా ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. ఈ క్రమంలో ఆసియా కప్ దక్కించుకోవడానికి భారత్ కేవలం ఒక్క మ్యాచ్ దూరంలో నిలిచింది. ఇక ఈరోజు మధ్యాహ్నం జరుగనున్న మరో సెమీఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్, శ్రీలంక జట్లు పోటీ పడతున్నాయి. దీనిలో గెలిచిన జట్టు ఫైనల్స్‌లో టీమిండియాతో తలపడుతుంది.

తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళల జట్టు.. 20 ఓవర్లలో 6 వికెట్లకు 148 పరుగులు చేసింది. ఓపెనర్‌ షెఫాలీ వర్మ మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 28 బంతుల్లో 42 పరుగులు చేసింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 30 బంతుల్లో 36 పరుగులు చేయగా.. జెమీమా రోడ్రిగ్స్ 26 బంతుల్లో 27 పరుగులు చేసింది. ఇక స్టార్ ప్లేయర్ ఓపెనర్‌ స్మృతి మంథాన 13 పరుగులు చేసి అవుట్ అయింది. ఆట ఆఖర్లో పూజా వస్త్రాకర్‌ 13 బంతుల్లో 14 పరుగులు చేయడంతో టీమిండియా ప్రత్యర్థి ముందు 148 పరుగుల లక్ష్యాన్ని ఉంచగలిగింది. అనంతరం 149 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన థాయ్‌లాండ్‌ జట్టు భారత్ కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో కేవలం 74 పరుగులు మాత్రమే చేసింది. టోర్నీలో మంచి ఫామ్ లో ఉన్న దీప్తి శర్మ మరోసారి అద్భుతంగ బౌలింగ్ చేసింది. దీప్తి 4 ఓవర్లలో కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టింది. ఇక మరో స్పిన్నర్‌ రాజేశ్వర్‌ గైక్వాడ్ 4 ఓవర్లలో 10 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీయగా.. స్నేహ్‌, రేణుక, షెఫాలీ తలా ఒక వికెట్‌ తీశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 4 =