ప్రముఖ సినీనటుడు అలీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమిస్తూ ఇటీవలే ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అలీ ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. సోమవారం విజయవాడ లోని సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి అందించిన నియామక పత్రం స్వీకరించిన అలీ, పదవీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం అలీ మాట్లాడుతూ, ఈ పదవీ బాధ్యతలు స్వీకరించడం సంతోషంగా ఉందని తెలిపారు. ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని అన్నారు. సలహాదారుగా విలువైన సలహాలు, సూచనలు అందించి ప్రభుత్వానికి, మీడియాకు తన వంతు సహకారం అందిస్తూ, మీడియా వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తానని అలీ పేర్కొన్నారు.
సీఎం వైఎస్ జగన్ ప్రజాభిమానం పొందిన గొప్ప నాయకుడు అని ఈ సందర్భంగా అలీ కొనియాడారు. ప్రజలకు మేలు చేసే విషయంలో సీఎం అనుకున్నది సాధిస్తారన్నారు. అలాగే రాష్ట్రంలో నవరత్నాలు పటిష్టంగా అమలవుతున్నాయని అలీ చెప్పారు. ఇటీవల తాను విశాఖలో పర్యటించిన సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ విధానాలు కళ్లకు కట్టినట్లుగా కనిపించాయన్నారు. సమాచార,పౌర సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న గొప్ప నటుడు, మానవతావాది అలీ అని పేర్కొన్నారు. అలాగే ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా అలీ సమర్థవంతంగా తన సేవలను అందిస్తారన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE







































