నేడే చంద్రగ్రహణం.. తెలుగు రాష్ట్రాలలో ఆలయాల మూసివేత

Today is Lunar Eclipse Many Temples Closes in Both AP and Telangana Upto Night,Lunar Eclipse Will Occurs In India On Today, Famous Temples Closed Across The Country, Partial Lunar Eclipse, Mango News, Mango News Telugu, Lunar Eclipse Will Occurs In India, Partial Lunar Eclipse In India, Lunar Eclipse In India, Lunar Eclipse In India News And Live Updates, Trumala Closed Amid Solar Eclipse, Yadadri Closed Amid Lunar Eclipse, TTD, Yadardri Temple

ఈ సంవత్సరంలో చివరి చంద్రగ్రహణం నేడు ఏర్పడనుంది. మంగళవారం మధ్యాహ్నం గం.2.39 ని. నుంచి సాయంత్రం గం.6.30 ని.ల వరకు చంద్రగ్రహణం కొనసాగనుంది. అయితే భారతదేశంలో మాత్రం ఈ చంద్రగ్రహణం భారత కాలమానం ప్రకారం నేటి సాయంత్రం గం.5.32 ని.ల వరకు కనిపిస్తుంది. సాయంత్రం గం.6.18 ని.లకు ముగుస్తుంది. కాగా ఇటీవల ఏర్పడిన సూర్యగ్రహణం తర్వాత కేవలం పదిహేను రోజుల వ్యవధిలోనే చంద్రగ్రహణం ఏర్పడుతుండటం గమనార్హం. అలాగే ఈ ఏడాది ఇప్పటివరకు ఏర్పడిన మొత్తం నాలుగు గ్రహణాలు కూడా దాదాపు రెండు వారాల వ్యవధిలోనే ఏర్పడటం విశేషం. ఇక నేడు ఏర్పడనున్న చంద్రగ్రహణం మనదేశంతో పాటుగా పలు ఇతర దేశాల్లో కూడా కనిపించనుంది.

అయితే ఈ చంద్రగ్రహణం దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఒక్కోలా కనిపించనుంది. మన హైదరాబాద్ లో మాత్రం ఇది పాక్షికంగానే కనిపించనుంది. ఇక దీనిని చూడటానికి ప్రత్యేక పరికరాలేమి అక్కరలేదని ఖగోళ నిపుణులు చెప్తున్నారు. హైదరాబాద్ లో చంద్రగ్రహణం సాయంత్రం గం.5.40 ని.ల నుంచి రాత్రి గం.7.26 ని.ల వరకు కొనసాగనుంది. ఇక చంద్రగ్రహణం కారణంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలోని ఆలయాలు మూతపడుతున్నాయి. తిరుపతి, శ్రీశైలం, ఇంద్రకీలాద్రి సహా వేములవాడ, యాదగిరిగుట్ట, భద్రాచలం, తదితర ఆలయాలతో పాటు అన్ని ఆలయాలను నిత్య కైంకర్య పూజల అనంతరం మూసివేస్తున్నారు. చంద్రగ్రహణం అనంతరం శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి ఆ తర్వాత యథావిధిగా ఆలయాలను తిరిగి తెరవనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + 12 =