తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక: వైఎస్సార్సీపీ అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తి పేరు ప్రకటన

Dr Gurumurthy, Dr Gurumurthy as a Candidate for Tirupati Loksabha By-election, Dr Gurumurthy as Tirupati LS Candidate, Dr Gurumurthy as Tirupati LS MP candidate, Mango News, Tirupati By Election, Tirupati Loksabha By-election, Tirupati LS bypoll, Tirupati LS MP candidate, YSRC names M Gurumurthy as candidate for Tirupati LS bypoll, YSRCP, YSRCP Announces Dr Gurumurthy as a Candidate for Tirupati Loksabha By-election, YSRCP officially announces Dr Gurumurthy as Tirupati LS Candidate

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికకు ఏప్రిల్ 17 న పోలింగ్ నిర్వహించనున్నట్టు తాజాగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్ ను విడుద‌ల చేసిన సంగతి తెలిసిందే. తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణించడంతో ఈ స్థానంలో ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో తిరుపతి లోక్‌సభ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్‌ గురుమూర్తి పోటీచేయనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. మరోవైపు తిరుపతి ఉపఎన్నిక కోసం మార్చి 23న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానుండగా, ఏప్రిల్ 17 వ తేదీన పోలింగ్ నిర్వహించి, మే 2 వ తేదీన ఓట్ల లెక్కింపు పక్రియ చేపట్టనున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − 9 =