తెలంగాణ స్టేట్ డెయిరీ డెవలప్మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఛైర్మన్ గా సోమా భరత్ కుమార్ ఇటీవలే నియమితులైన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు సోమా భరత్ కుమార్ నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు (నవంబర్ 10, గురువారం) తెలంగాణ స్టేట్ డైరీ డెవలప్ మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఛైర్మన్ గా సోమా భరత్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు, కుటుంబసభ్యులు పాల్గొని పదవీ బాధ్యతల స్వీకరణ సందర్భంగా సోమా భరత్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపారు.
కాగా ఈ పదవీలో నేటి నుంచి సోమా భరత్ కుమార్ రెండేళ్ల పాటుగా కొనసాగనున్నారు. ముందుగా నవంబర్ 8, సోమవారం నాడు డెయిరీ కార్పొరేషన్ చైర్మన్గా తన నియామక ఉత్తర్వులను ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ చేతులమీదుగా సోమా భరత్ కుమార్ అందుకున్నారు. తనకు అవకాశమిచ్చినందుకు సీఎం కేసీఆర్ కు భరత్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE








































