తెలంగాణ ఎంసెట్-2022 రెండో విడత కౌన్సెలింగ్ వాయిదా, మళ్ళీ ఎప్పటినుంచంటే?

TS EAMCET-2022 Revised Second Phase Admissions Counselling Schedule Released, TS EAMCET revised counselling schedule, TS EAMCET-2022, Revised Second Phase Admissions Counselling Schedule Released, TS EAMCET 2022 Counselling, TS EAMCET 2022 Counselling Dates, Second Phase Admissions Counselling Schedule, Telangana EAMCET-2022, 2022 TS EAMCET, TS EAMCET-2022 News, TS EAMCET-2022 Latest News And Updates, TS EAMCET-2022 Live Updates, Mango News, Mango News Telugu

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మూడు విడ‌త‌ల్లో ఎంసెట్‌-2022 అడ్మిషన్స్ కౌన్సెలింగ్‌ నిర్వ‌హించ‌నున్నట్టు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రకటించిన విషయం తెలిసిందే. ఆగస్టు 21 నుంచి మొదటి విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమవగా, షెడ్యూల్‌ ప్రకారం సెప్టెంబర్ 28న ప్రారంభం కావాల్సిన రెండో విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ వాయిదా పడింది. కాగా అక్టోబర్‌ 11వ తేదీ నుంచి రెండో విడత ఎంసెట్ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ మేరకు టీఎస్ ఎంసెట్‌-2022 అడ్మిషన్స్ కన్వీనర్, టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇంజినీరింగ్ ఫీజుల విషయంలో ఇంకా పూర్తి స్పష్టత రాకపోవడంతోనే 28 నుంచి జరగాల్సిన రెండో విడత కౌన్సెలింగ్ వాయిదా పడినట్టు తెలుస్తుంది.

టీఎస్‌ ఎంసెట్-2022 అడ్మిషన్స్ రెండో విడత కౌన్సెలింగ్‌ షెడ్యూల్:

  • ఆన్‌లైన్ లో ప్రాథమిక సమాచారం నమోదు, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ (మొదటి విడతలో హాజరుకాని విద్యార్థులకు) – అక్టోబర్ 11 నుంచి అక్టోబర్ 12 వరకు
  • స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థుల సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసే తేదీలు – అక్టోబర్ 12
  • వెబ్‌ ఆప్షన్స్ పక్రియ – అక్టోబర్ 12 నుంచి అక్టోబర్ 13 వరకు
  • వెబ్‌ ఆప్షన్స్ ఫ్రీజింగ్ – అక్టోబర్ 13
  • రెండో విడత సీట్లు కేటాయింపు – అక్టోబర్ 16
  • వెబ్ సైట్ ద్వారా ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్ – అక్టోబర్ 16 నుంచి అక్టోబర్ 18 వరకు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − 3 =