రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై టీఎంసీ మంత్రి అనుచిత వ్యాఖ్యలు.. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ క్షమాపణలు

West Bengal CM Mamata Banerjee Apologises For TMC Minister Remarks on President Droupadi Murmu,West Bengal CM Mamata Banerjee,President Droupadi Murmu,TMC Minister Remarks on President,Mango News,Mango News Telugu,Trunamul Congress Party,Droupadi Murmu Presents National Florence ,Droupadi Murmu Latest News And Updates, Droupadi Murmu Nightingale Awards-2021, Nightingale Awards News

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై తన కేబినెట్ మంత్రి చేసిన వ్యాఖ్యలను టీఎంసీ అధినేత్రి, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఖండించారు. అంతేకాకుండా రాష్ట్రపతికి క్షమాపణలు చెప్పారు. సోమవారం నబన్నాలో మీడియా సమావేశంలో దీనిపై సీఎం మమత మాట్లాడుతూ.. వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం తమ పార్టీ సంస్కృతిలో లేదని, అయితే తమ మంత్రి వ్యాఖ్యలు తమను ఆశ్చర్యపరిచాయని.. అందుకే ఆయనను హెచ్చరించడంతో పాటు పార్టీ తరపున క్షమాపణలు కూడా చెప్తున్నామని ఆమె అన్నారు. తాము రాష్ట్రపతిని చాలా గౌరవిస్తామని, ఆమె చాలా ఉన్నతమైన మహిళ అని అన్నారు. ఆమెపై మంత్రి అఖిల్ గిరి ఈ విషయంలో తప్పు చేశారని, అందుకే ఆయన వ్యాఖ్యలకు తాను క్షమాపణలు కోరుతున్నానని మమతా బెనర్జీ చెప్పారు.

కాగా ఈస్ట్‌ మిడ్నాపూర్‌లోని రామ్‌నగర్‌కు చెందిన ఎమ్మెల్యే, బెంగాల్‌ జైళ్ల శాఖ మంత్రి అఖిల్‌గిరి గతవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. నందిగ్రామ్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు బెంగాల్‌ బీజేఎల్పీ నేత సువేందు అధికారిను ఉద్దేశించి విమర్శలు చేస్తూ.. మేము రాష్ట్రపతి కుర్చీని గౌరవిస్తాం కానీ, మీ రాష్ట్రపతి చూడటానికి ఎలా ఉంటారు? అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. బీజేపీ శ్రేణులు ఆయనపై పలు ప్రాంతాల్లో కేసులు కూడా పెట్టడం జరిగింది. దీంతో తన తప్పుని గ్రహించిన మంత్రి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి క్షమాపణలు చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 9 =