ఆరాంఘర్-శంషాబాద్ రోడ్డు విస్తరణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలి: సీఎస్ సోమేశ్ కుమార్

CS Somesh Kumar holds Review on Aramghar Chowrasta-Shamshabad Road Widening Works,CS Somesh Kumar,Aramghar Chowrasta,Shamshabad Road,Chowrasta-Shamshabad Road Widening Works,Mango News,Mango News Telugu,Aramghar Chowrasta-Shamshabad Road,Telangana Cs Somesh Kumar, KTR, Kalavakuntla Kavitha, Telanagana TRS,K Chandra Shekar Rao,Kalavakuntla Taraka Rama Rao,TRS Latest News And Updates, Bharat Rashtra Samithi,TRS Party, Mango News Telugu

ఆరాంఘర్ చౌరస్తా-శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ మార్గంలో రోడ్డు, అభివృద్ధి, విస్తరణ పనులను మరింత వేగవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ఆదేశాల మేరకు ఆరాంఘర్-శంషాబాద్ రోడ్డు విస్తరణ పనుల పురోగతిపై సీఎస్ సోమవారం బి.ఆర్‌.కె.ఆర్‌ భవన్‌లో ఆర్‌అండ్‌బీ, ట్రాన్స్ కో, రెవెన్యూ, ఎండోమెంట్స్, వక్ఫ్ బోర్డు తదితర శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రూ.283 కోట్ల వ్యయంతో 10 కిలోమీటర్ల మేర ఆరు లైన్ల రోడ్డు విస్తరణ, రెండు సర్వీస్ రోడ్లు మరియు రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. వీటితోపాటు వ్యవసాయ విశ్వవిద్యాలయం, సాతంరాయి, ఎయిర్ పోర్ట్ ప్రవేశ మార్గాల వద్ద అండర్ పాస్ లు, గగన్ పహాడ్ వద్ద ఫ్లైఓవర్, శంషాబాద్ టౌన్ లో ఎలివేటెడ్ కారిడార్ ల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ రోడ్డు విస్తరణ పనుల వల్ల ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని, అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు.

రోడ్డు విస్తరణకు అడ్డంకిగా ఉన్నవిషయాలపై ప్రజాప్రతినిధులతో సమావేశం వెంటనే నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ డిసెంబర్ మాసాంతంలోగా పనులను పూర్తి చేసేందుకు సమన్వయంతో కృషిచేయాలని సూచించారు. ట్రాఫిక్ నిర్వహణకు సంబంధించి పోలీసు శాఖ సేవలను వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. ఈ పనుల పురోగతిపై తాను స్వయంగా ఆకస్మిక తనిఖీలు కూడా నిర్వహిస్తానని సీఎస్ సోమేశ్ కుమార్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో రోడ్డు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ కార్యదర్శి అనీల్ కుమార్, హైదరాబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్, వక్ఫ్ బోర్డు కార్యనిర్వహణ అధికారి షాన్ వాజ్ ఖాసీమ్, విద్యుత్ శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ రావు, కేంద్ర ప్రభుత్వ రహదారుల శాఖ ప్రాంతీయ అధికారి ఖుషావా, ట్రాన్స్కో డైరెక్టర్ జగత్ రెడ్డి, జాతీయ రహదారుల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ధర్మారెడ్డి, రాజేంద్రనగర్ ఆర్డీవో చంద్రకళ, శంషాబాద్ ఏసీపీ భాస్కర్, తదితర అధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + thirteen =