ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు.. నెల్లూరు కోర్టులో చోరీ కేసు సీబీఐకి అప్పగింత

AP High Court Orders To Hand Over The Theft Case in Nellore Court To CBI Today,AP High Court,AP High Court Orders,Theft Case in Nellore,Mango News,Mango News Telugu,Theft Case Hand Over CBI,CBI Latest News And Updates,CBI Andhra Pradesh,Central Bureau of Investigation,Central Bureau of Investigation News And Updates, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates,Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నెల్లూరు జిల్లా కేంద్రంలోని కోర్టులో ఫైల్స్ మిస్సింగ్ కేసును సీబీఐ విచారణకు అప్పగించింది. ఈ మేరకు జస్టిస్ పీకే మిశ్రా గురువారం కీలక ఆదేశాలు జారీ చేశారు. కాగా గతేడాది ఏప్రిల్ నెలలో ఏపీకి చెందిన ఒక ప్రజాప్రతినిధి కేసుకు సంబంధించిన దర్యాప్తు పత్రాలు, స్టాంపులు, ఇతర ఆధారాలు చోరీకి గురయ్యాయి. ఏప్రిల్ 13న అర్థరాత్రి కొందరు నెల్లూరు కోర్టు సముదాయంలోని 4వ అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులోకి ప్రవేశించి కీలక కేసుకి సంబంధించిన ఆధారాలు పట్టుకెళ్లారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. తర్వాతి రోజు ఉదయం దీనిని గుర్తించిన కోర్టు సిబ్బంది స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇది చివరికి హైకోర్టుకి చేరగా గత కొన్ని నెలలుగా విచారణ జరుపుతున్న న్యాయస్థానం దీనిపై ఈరోజు కీలక నిర్ణయం తీసుకుంది. నెల్లూరు కోర్టులో ఫైల్స్ మిస్సింగ్ వ్యవహారాన్ని సీబీఐతో విచారణ జరిపించాలని ఆదేశిసిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 1 =