డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పురోగతి, లబ్దిదారుల ఎంపిక ప్రక్రియపై మంత్రి ప్రశాంత్‌ రెడ్డి సమీక్ష

Minister Prashant Reddy held Review on Progress of Double Bedroom Houses Construction Selection Process of Beneficiaries,Minister Prashant Reddy,Review on Double Bedroom Houses,Double Bedroom Houses Construction,Selection Process of Beneficiaries,Mango News,Mango News Telugu,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

రాష్ట్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పురోగతి మరియు లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ వివరాలపై తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ సహా పలువురు రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకంలో భాగంగా ఇప్పటివరకు రూ.19,328.32 కోట్ల ప్రతిపాదిత వ్యయంతో 2,91,057 ఇళ్లను మంజూరు చేసినట్టు తెలిపారు.

కాగా ఇందులో 2,28,529 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేప్పట్టగా, 1,29,528 ఇళ్ల నిర్మాణం పూర్తయిందన్నారు. మరో 58,350 ఇళ్ల నిర్మాణం తుదిదశకు చేరుకోగా, మిగిలిన 40,651 ఇళ్ళు నిర్మాణ దశలో ఉన్నాయని చెప్పారు. ఇప్పటివరకు పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.11,614.95 కోట్లు ఖర్చు చేసిందని మంత్రి ప్రశాంత్‌ రెడ్డి పేర్కొన్నారు. మరోవైపు ఇళ్ల కేటాయింపుకై సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు లబ్ధిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా ఉండాలని, నిర్మాణం పూర్తయిన మరియు తుది దశలో ఉన్న ఇళ్లకు వెంటనే మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని మంత్రి ప్రశాంత్‌ రెడ్డి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × three =