బంగ్లాదేశ్ తో మూడు వన్డేల సిరీస్: రవీంద్ర జడేజా, యాష్ దయాల్ స్థానంలో కుల్దీప్ సేన్, షాబాజ్ అహ్మద్‌

India vs Bangladesh 3-match ODI Series Kuldeep Sen Shahbaz Ahmed Replaces Yash Dayal and Jadeja,India vs Bangladesh,3 match ODI Series, Kuldeep Sen, Shahbaz Ahmed Replaces Yash Dayal, Jadeja,Mango News ,Mango News Telugu,India Vs Bangladesh,IND VS Bangladesh,IND vs BNG,India vs Bangladesh 3-match ODI Series,Indian Cricket Team,Bangladesh Cricket Team,India,Bangladesh,Bangladesh vs India, India in Bangladesh, 3rd ODI Match

డిసెంబర్ మొదటి వారంలో భారత్ క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ లో పర్యటించనున్న విషయం తెలిసిందే. భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య డిసెంబర్ 4, 7, 10 తేదీల్లో మూడు వన్డేల సిరీస్, డిసెంబర్ 14-18, 22-26 మధ్య రెండు టెస్టుల సిరీస్ జరగనుంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ తో జరిగే వన్డే, రెండు టెస్టుల సిరీస్ ల కోసం ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ ఇప్పటికే భారత్ జట్టును ఎంపిక చేయగా, తాజాగా భారత్ వన్డే జట్టులో చోటుచేసుకున్న మార్పులపై బీసీసీఐ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. బంగ్లాదేశ్‌తో జరగనున్న 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కి యాష్ దయాల్, రవీంద్ర జడేజాల స్థానంలో ఫాస్ట్ బౌలర్ కుల్దీప్ సేన్ మరియు ఆల్ రౌండర్ షాబాజ్ అహ్మద్‌లను ఆల్-ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసినట్టు బీసీసీఐ తెలిపింది.

యాష్ దయాల్‌ వెన్నుముక సమస్యతో ఇబ్బంది పడుతున్నాడని మరియు రవీంద్ర జడేజా మోకాలి గాయం నుండి ఇంకా కోలుకోలేదన్నారు. వారిపై బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. ఈ క్రమంలోనే వారి స్థానంలో కుల్దీప్ సేన్, షాబాజ్ అహ్మద్‌ ను ఎంపిక చేసినట్టు తెలిపారు. ముందుగా న్యూజిలాండ్‌లో నవంబర్ 25న ఆక్లాండ్‌లో ప్రారంభమయ్యే 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు కుల్దీప్ సేన్ ను మరియు షాబాజ్‌ ను ఎంపిక చేశారు, అయితే వారు ఇప్పుడు బంగ్లాదేశ్‌కు వెళ్లే జట్టులో భాగం కానున్నట్టు బీసీసీఐ తెలిపింది. వారి స్థానంలో ప్రస్తుతం న్యూజిలాండ్‌లో ఉన్న వన్డే జట్టులో ఎవరినీ భర్తీ చేయలేదని పేర్కొన్నారు. అదేవిధంగా బంగ్లా-ఏ జట్టుతో మొదటి నాలుగు రోజుల మ్యాచ్‌కు, 2వ నాలుగు రోజుల మ్యాచ్‌ లకు భారత్-ఏ జట్లను కూడా బీసీసీఐ ప్రకటించింది. మరోవైపు బంగ్లాదేశ్ తో సిరీస్ లకు కెప్టెన్‌ గా రోహిత్‌ శర్మ, వైస్ కెప్టెన్ గా కేఎల్ రాహుల్ వ్యవహరించనున్నారు.

బంగ్లాదేశ్ తో 3 వన్డేలకు భారత్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, శ్రేయాస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, మహమ్మద్. సిరాజ్, దీపక్ చాహర్, కుల్దీప్ సేన్.

బంగ్లాదేశ్ తో భారత్ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్:

  • మొదటి వన్డే – డిసెంబర్ 4 – షేర్ బంగ్లా నేషనల్ స్టేడియం, ఢాకా
  • రెండో వన్డే – డిసెంబర్ 7 – షేర్ బంగ్లా నేషనల్ స్టేడియం, ఢాకా
  • మూడో వన్డే – డిసెంబర్ 10 – జహుర్ అహ్మద్ చౌదరి స్టేడియం, చటోగ్రామ్.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + 8 =