కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు మరియు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించడం ద్వారా కేంద్రంలో అధికారం చేపట్టేందుకై ఆ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ నేటితో 100కు చేరింది. రాజస్థాన్ లోని మీనా హైకోర్టు నుండి శుక్రవారం ఉదయం రాహుల్ గాంధీతో పాటు మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మరియు పార్టీ ఇతర సీనియర్ నాయకులు యాత్రను ప్రారంభించారు. కాగా సెప్టెంబరు 7న కన్యాకుమారిలో ప్రారంభమైన యాత్ర తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో పూర్తి చేసుకుని ఇప్పుడు రాజస్థాన్‌లో కొనసాగుతోంది. ఇదేక్రమంలో రాహుల్ పాదయాత్ర డిసెంబరు 24న దేశ రాజధాని ఢిల్లీలో ప్రవేశించనుంది. అనంతరం ఎనిమిది రోజుల విరామం తర్వాత ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, చివరగా జమ్మూ కాశ్మీర్‌లో అడుగు పెట్టనున్నారు.
రాహుల్ గాంధీ నేతృత్వంలోని పాదయాత్ర 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ దీనిపై స్పందిస్తూ.. ప్రజలకు సంబంధించిన అంశాలను హైలైట్ చేయడమే భారత్ జోడో యాత్ర యొక్క అతిపెద్ద విజయమని పేర్కొంది. అలాగే జనవరి 26 నుండి పార్టీ చేపట్టబోయే తదుపరి ప్రచారం ద్వారా యాత్ర సందేశాన్ని వ్యాప్తి చేస్తామని కూడా తెలిపింది. ఈ యాత్ర ద్వారా రాహుల్ గాంధీ దేశంలోని అన్ని వర్గాల ప్రజలతో మమేకం అవుతున్నారని, ఆయన యాత్రకు యువత నుంచి విశేష స్పందన వస్తోందని వెల్లడించింది. ఇక రాహుల్ యాత్రలో అనేకమంది ప్రముఖులు కూడా పాల్గొన్నారు. రాహుల్ తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంక గాంధీ వాద్రా కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. సినీ నటులు పూజా భట్, రియా సేన్, సుశాంత్ సింగ్, స్వర భాస్కర్, రషమీ దేశాయ్, ఆకాంక్ష పూరి మరియు అమోల్ పాలేకర్ వంటి చలనచిత్ర మరియు టీవీ ప్రముఖులు ఆయనతో కలిసి నడిచారు. అలాగే తాజాగా రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్ రఘురాం రాజన్ కూడా జోడోయాత్రలో పాల్గొన్న సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ