ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు శుభవార్త. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు త్వరలోనే ట్యాబ్‌లును అందించనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జన్మదినం (డిసెంబర్ 21) సందర్భంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ట్యాబ్‌లను పంపిణీ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. డిసెంబర్ 21న సీఎం జగన్ చేతులు మీదుగా వీటిని పంపిణీ చేయనున్నారు. దీంతో రాష్ట్ర వ్యాపటంగా దాదాపు 4.6 లక్షల మంది విద్యార్థులు ట్యాబ్‌లను అందుకోనున్నారు. వీరితో పాటు మరో 60,000 మంది ఉపాధ్యాయులకు కూడా ఈ ట్యాబ్‌లను అందజేయనున్నారు. కాగా ప్రతి సంవత్సరం 8వ తరగతిలో ప్రవేశించే విద్యార్థులకు ఈ స్టడీ ఎయిడ్ ట్యాబ్‌లను అందజేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు. తద్వారా తదుపరి తరగతుల్లో కూడా వీటిని ఉపయోగించుకుని, 10వ తరగతి పరీక్షల్లో మెరుగ్గా రాణించడంలో వారికి సహాయపడాలనేది ఆయన ఆలోచనగా ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
దీనికోసం ఏపీ ప్రభుత్వం రూ.1400 కోట్లు కేటాయించిందని, ఒక్కో ట్యాబ్ విలువ రూ.15,000 ఉంటుందని అధికారులు తెలిపారు. ఇక విద్యార్థులకు అందించే ట్యాబ్‌లలో ‘బైజూస్’ కంటెంట్ అందుబాటులో ఉంటుందని, దీనికోసం ఒక్కో ట్యాబ్‌కు మరో రూ.15,000 ఖర్చు అవుతుందని వారు చెప్పారు. ఈ ట్యాబ్‌లలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, జియాలజీ, బయాలజీ, గణితం, పౌరశాస్త్రం సబ్జెక్టుల పాఠాలు అందుబాటులో ఉంటాయని, తెలుగు, ఇంగ్లిష్ సహా మొత్తం 8 భాషల్లో పాఠాలు ఉంటాయని అధికారులు తెలిపారు. విద్యార్థులకు సులభంగా సబ్జెక్టులు అర్థమయ్యేలా యానిమేషన్, వీడియో, ఆడియో కంటెంట్ ఇందులో ఉంటుందని వారు వివరించారు. కాగా ఈ ట్యాబ్ శాంసంగ్ గెలాక్సీ ఏ7 లైట్ మోడల్ అని, దీనిలో 32 జీబీ మెమొరీ స్టోరేజీ ఉంటుందని తెలిపారు. ఇక ట్యాబ్ స్క్రీన్ సైజ్ 22.05 సెంటిమీటర్లు అని, ఇది ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుందని వెల్లడించారు. అలాగే 3 జీబీ ర్యామ్‌తో పనిచేసే ఈ ట్యాబ్ 366 గ్రాముల బరువు ఉంటుందని, దీనికి మూడేళ్ల వారంటీ కూడా ఉంటుందని అధికారులు వివరించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ