రాష్ట్ర వాణిజ్య పన్నుల విభాగంపై అధ్యయనానికి అస్సాం అధికారుల బృందం, సీఎస్ తో భేటీ

Assam State Officials Team Visits Telangana to Study the State Commercial Taxes Dept Meets CS Somesh Kumar,Assam State Officials,Assam Officials Visits Telangana,State Commercial Taxes Dept,Telangana State Commercial Taxes Dept ,Mango News,Mango News Telugu,Telangana CS Somesh Kumar,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

తెలంగాణ రాష్ట్రంలో వాణిజ్య పన్నుల విధానంలో గణనీయమైన మార్పు వచ్చిందని, వ్యవస్థీకృత ఆధారిత పన్ను అమలుపై దృష్టి సారించామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్ పేర్కొన్నారు. అస్సాం రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులు శనివారం సీఎస్ సోమేశ్ కుమార్ తో బి.ఆర్.కె.ఆర్ భవన్లో భేటీ అయ్యారు. శాఖాపరంగా పలు యాప్‌లు, మాడ్యూల్స్ లను అభివృద్ధి చేశామని ఈ సందర్భంగా సీఎస్ వారికీ తెలిపారు. అన్ని నోటీసులు, ప్రొసీడింగ్‌ల జారీ మాన్యువల్ గా ఇవ్వడం తొలగించామని అన్నారు. వ్యక్తిగత టార్గెట్ లు, విధుల ఆధారిత లక్ష్యాలతో ఈ యాప్ లున్నాయని వివరించారు. కొత్తగా అనేక సర్కిళ్లను ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్ర కమర్షియల్ టాక్స్ శాఖను పునర్వ్యవస్థీకరించామని, పరిశోధన, విశ్లేషణల కోసం ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని సీఎస్ తెలిపారు.

కాగా అస్సాం రాష్ట్రంలో ఇప్పటికీ సాంప్రదాయ పద్ధతి ద్వారానే శాఖాపరమైన కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నామని అస్సాం అధికారులు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేసి తమ రాష్ట్రంలో కూడా అమలు చేయనున్నట్టు వారు పేర్కొన్నారు. ఈ సమావేశంలో కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ నీతూ ప్రసాద్, అదనపు కమిషనర్లు సాయి కిషోర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. అలాగే అస్సాం కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ బాసుమతరీ ఫూలేశ్వర్, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × one =