కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ముగిసిన భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలో చేపట్టిన ‘హాథ్ సే హాథ్ జోడో అభియాన్’ పాదయాత్ర ప్రస్తుతం భద్రాచలంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో మంగళవారం భద్రాచలం నియోజకవర్గంలో రేవంత్ పాదయాత్రలో పలువురు టీ-కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొననున్నారు. వీరిలో ప్రధానంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మరియు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పీసీసీ అధ్యక్షుడు వి. హనుమంతరావు (వీహెచ్) రేవంత్ రెడ్డితో కలిసి పాదయాత్రలో నడవనున్నారు. నేడు మరియు రేపు రెండు రోజుల పాటు పాదయాత్రలో పాల్గొనబోతున్నట్లు తెలిపిన వీహెచ్.. ఈరోజు భద్రాచలంలో, రేపు పాలకుర్తిలో పాదయాత్రలో పాల్గొంటానని వీహెచ్ వెల్లడించారు.
ఈ రోజు సాయంత్రం భద్రాచలంలో పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో కలిసి పాదయాత్రలో పాల్గొంటానని, అలాగే రేపు పాలకుర్తి నియోజకవర్గంలో జరుగనున్న పాదయాత్రలో పాల్గొననున్నట్లు వీహెచ్ తెలిపారు. ఇక ఇదిలా ఉండగా.. మరోవైపు పాలకుర్తిలో కొద్దిపాటి టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒక వైపు రేవంత్ రెడ్డి, ఇంకో వైపు వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ‘ప్రజా ప్రస్థానం’ పాదయాత్రలు నేడు పాలకుర్తిలోకి ప్రవేశించనున్నాయి. రేపు, ఎల్లుండి రెండురోజుల పాటు పాలకుర్తిలో రేవంత్ రెడ్డి, వైఎస్ షర్మిల పాదయాత్రలు జరుగనున్నాయి. దీంతో ఇద్దరు ముఖ్య నేతల పాదయాత్రలు ఒకే నియోజకవర్గంలో కొనసాగనున్న నేపథ్యంలో పాలకుర్తిలో పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేయనున్నారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE