తెలంగాణ: కరోనా బాధితులకు, అనుమానితులకు కీలక సమాచారం

Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, COVID-19, Key Information to Covid-19 Patients, Key Information to Covid-19 Patients and Suspects, telangana, Telangana Coronavirus, Telangana Coronavirus Cases, Telangana Coronavirus Deaths, Telangana Coronavirus News

తెలంగాణ రాష్ట్రంలో జూలై 10, శుక్రవారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 32,224 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలకు వైద్య ఆరోగ్యశాఖ కీలక సమాచారాన్ని అందించింది. కరోనా బాధితులు, అనుమానితులు వారి యొక్క లక్షణాలు, తీవ్రతని బట్టి ఏఏ ఆసుపత్రులను సంప్రదించాలో వివరించారు.

  • కరోనా పాజిటివ్ రిపోర్టు కలిగి ఉండి మోస్తరు లేదా తీవ్రమైన లక్షణాలతో ఉన్న బాధితులు “గాంధీ ఆసుపత్రి” కి వెళ్లాలని సూచించారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స మరియు సదుపాయాలతో రాష్ట్ర ప్రభుత్వం విస్తృతమైన ఏర్పాట్లు చేసిందని పేర్కొన్నారు.
  • లక్షణాలతో బాధపడుతూ ఇంకా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కానివారు, మరియు కరోనా వైద్య పరీక్షలు అవసరమైన వారు జిల్లా ఆసుపత్రులకు, హైదరాబాద్ నగరంలో అయితే కింగ్ కోటి ఆసుపత్రి, ఫీవర్ ఆసుపత్రి మరియు చెస్ట్ ఆసుపత్రి లకు వెళ్లాలని సూచించారు.
  • కరోనా బాధితులకు చికిత్స చేయడానికి ప్రభుత్వం విస్తృతమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులలో తగినంత పడకలు అందుబాటులో ఉన్నాయని, క్లినికల్ అవసరాల ఆధారంగా పడకలు అందించబడతాయని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రులలో చికిత్స ఉచితంగా ఇవ్వబడుతుందని, సరిపడినంతగా పిపిఇ కిట్లు మరియు మందులు ఆసుపత్రులలో లభిస్తాయని వెల్లడించారు.
  • కరోనాకు సంబంధించి టెలిమెడిసిన్ కోసం, హెల్ప్ లైన్ నెం-180059912345 ను సంప్రదించాలని కోరారు.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + eleven =