ఉమెన్స్ ప్రీమియర్ లీగ్: ఆర్‌సీబీ కీలక నిర్ణయం.. మహిళల జట్టుకు మెంటార్‌గా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా నియామకం

WPL Royal Challengers Bangalore Appointed Sania Mirza as Mentor For Women's Team,Rcb Women'S Team,Rcb Women'S Ipl Team,Rcb Team List 2020,Sania Mirza Rcb,Sania Mirza,Sania Mirza Images,Mango News,Mango News Telugu,Sania Mirza Ranking,Sania Mirza Reel,Sania Mirza Racquet,Sania Mirza And Ram Charan,Sania Mirza News And Updates,Sania Mirza Latest News And Updates,Sania Mirza News,Sania Mirza Latest Updates,Sania Mirza Rcb News

మహిళల ప్రీమియర్ లీగ్‌కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) కీలక నిర్ణయం తీసుకుంది. తన మహిళల జట్టుకు మెంటార్‌గా భారత టెన్నిస్ ఐకాన్ సానియా మీర్జాను నియమించుకుంది. ఈ మేరకు బుధవారం ఆర్‌సీబీ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా దీనిని ధృవీకరించింది. ‘మహిళల జట్టు కోసం.. భారతీయ క్రీడలలో అగ్రగామి, యూత్ ఐకాన్, తన కెరీర్‌లో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టిన వ్యక్తి, మైదానంలో మరియు వెలుపల ఛాంపియన్ అయిన సానియా మీర్జాను ఆర్‌సీబీ మహిళా క్రికెట్ జట్టు మెంటార్‌గా స్వాగతిస్తున్నందుకు మేము గర్విస్తున్నాము’ అని అందులో పేర్కొంది. కాగా ఇటీవలే సానియా మీర్జా తన అంతర్జాతీయ టెన్నిస్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇక ఈ సందర్భంగా సానియా మీర్జా దీనిపై స్పందిస్తూ.. ‘ఈ వార్త వినగానే తొలుత నేను కొంచెం ఆశ్చర్యపోయాను. అదృష్టవశాత్తూ నేను 20 సంవత్సరాలుగా ప్రొఫెషనల్ అథ్లెట్‌గా ఉన్నాను. ఇక రిటైర్మెంట్ అనంతరం నా వంతు కర్తవ్యంగా దేశంలోని యువతులకు క్రీడలను కెరీర్ ఎంపికలలో ఒకటిగా ఎంచుకోవడంలో సహాయపడాలని భావించాను. ఈ సమయంలో ఆర్‌సీబీ నన్ను తన మహిళా జట్టుకు మెంటార్‌గా ఎంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వారిలో స్ఫూర్తి నింపడానికి మరియు ఉత్సాహం నింపడానికి నాదైన రీతిలో ప్రయత్నం చేస్తాను. ఏ క్రీడకైనా ఒత్తిడిని తట్టుకోవడం కీలకం. ఆటగాళ్ల మానసిక కోణంలో వారితో కలిసి పని చేయాల్సి ఉంటుంది. క్రికెట్ మరియు టెన్నిస్ మధ్య చాలా సారూప్యతలు ఉన్నాయి. అయితే ప్రతి ప్లేయర్ ఒకే విధంగా ఆలోచిస్తారు మరియు వారు ఒకే రకమైన ఒత్తిడికి గురవుతారు. ఒత్తిడి పరిస్థితులను ఎదుర్కోవడం, వాటిని స్వీకరించడం చాలా ముఖ్యం. ఏ ఆటలోనైనా సరే ఒత్తిడిని స్వీకరించలేకపోతే వారు రాణించలేరు. ప్రపంచవ్యాప్తంగా ఛాంపియన్లుగా నిలిచిన వారందరూ ఒత్తిడిని అధిగమించినవారేనని మనం గుర్తుంచుకోవాలి. అప్పుడే మన పూర్తి ఏకాగ్రతను ఆట మీద కేంద్రీకరించగలం’ అని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE