తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నేటినుంచి మూడు రోజుల తూర్పు గోదావరి మరియు కాకినాడ జిల్లాల పర్యటనను ప్రారంభించారు. పర్యటనలో భాగంగా ఆయన గురువారం కాకినాడ జిల్లా జగ్గంపేటలో పార్టీ కార్యకర్తలతో ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. సంక్షేమం, అభివృద్ధి అంటే మొదట గుర్తొచ్చే పార్టీ టీడీపీయేనని పేర్కొన్నారు. సంక్షోభ సమయాల్లో కూడా ప్రజలకు అండగా ఉండేవాడే అసలైన నాయకుడని, ప్రజలను ఇబ్బందులకు గురిచేసేవాడు ఎప్పటికీ నాయకుడు కాలేడని అన్నారు. దేశంలో కార్యకర్తలకు గుర్తింపు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, వారి కుటుంబాలకు ఆర్ధిక భరోసా కల్పించడం కోసం కార్యకర్తలకు జీవిత బీమా సౌకర్యాన్ని కల్పించామని చంద్రబాబు గుర్తు చేశారు.
టీడీపీకి ఆస్తి కార్యకర్తలేనని, వారి సహకారంతోనే వచ్చే ఎన్నికల్లో ఘనవిజయం సాధించి మళ్ళీ టీడీపీ అధికారం చేపడుతుందని టీడీపీఅధినేత ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా గిట్టుబాటు ధర లేక రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని తెలిపారు. మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, యువత ఉపాధి కలాం లేక పక్క రాష్ట్రాలకు తరలిపోతుందని మండిపడ్డారు. ప్రజలు వైసీపీ పాలనపై ఆగ్రహంతో ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీకి షాక్ తగిలేలా వారు తీర్పు ఇవ్వనున్నారని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE