ఎటు చూసినా వారే!

AP Politics Around NTR's Political Legacy, AP Politics Around NTR, NTR Political Legacy, Political Legacy, NTR Family Dominates Andhra Politics, NTR Family Dominates, NTR Family AP, Political Legacy AP, AP Elections 2024, Lok Sabha Elections, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
ntr family dominates andhra politics telugu news

ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు నందమూరి తారక రామారావు రాజకీయ వారసత్వానికి కేంద్ర బిందువుగా మారాయి. ఆయన మరణించి 28 ఏళ్లు గడుస్తున్నా ఎన్టీఆర్‌ ఇంకా రాజకీయ రంగాన్ని శాసిస్తూనే ఉన్నారు. ప్రస్తుత ఏపీలో రెండు ప్రధాన పార్టీలకు ఆయన కుటుంబ సభ్యులే నేతృత్వం వహిస్తున్నారు. ఆయన అల్లుడు నారా చంద్రబాబు నాయుడు దాదాపు మూడు దశాబ్దాలుగా టీడీపీ అధినేతగా ఉండగా.. ఆయన కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరి బీజేపీ రాష్ట్ర శాఖకు నాయకత్వం వహిస్తున్నారు. ఈ ఇద్దరూ వేరు వేరు పార్టీలో ఉన్నా పొత్తులో భాగంగా ఉన్నారు. 73 ఏళ్ల చంద్రబాబుకు ఈ ఎన్నికలు చాలా కీలకం. అటు 2019 ఎన్నికల్లో అరంగేట్రం చేసి ఓడిపోయిన  చంద్రబాబు తనయుడు నారా లోకేష్ భవిష్యత్తుకు కూడా ఈ ఎన్నికల ఫలితాలే కీలకంగా మారడం ఆసక్తిని రేపుతోంది.

గతేడాది బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలిగా నియమితులైన పురంధేశ్వరి 2019లో విశాఖ లోక్‌సభ స్థానం నుంచి నాలుగో స్థానంలో నిలిచి ఘోర పరాజయాన్ని చవిచూశారు. ఈ సారి రాజమండ్రి నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఎన్టీఆర్ కుటుంబంలో మరో కీలక వ్యక్తి ఆయన తనయుడు, ప్రముఖ నటుడు బాలకృష్ణ. తన తండ్రి మూడుసార్లు ప్రాతినిధ్యం వహించిన హిందూపురం నియోజకవర్గం నుంచి వరుసగా మూడోసారి పోటీకి దిగుతున్నారు. 2019 ఎన్నికల్లో విశాఖ లోక్‌సభ స్థానం నుంచి స్వల్ప తేడాతో ఓడిపోయిన బాలకృష్ణ రెండో అల్లుడు ఎం.భరత్ మళ్లీ టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు.

చంద్రబాబు నాయుడు సతీమణి డి.భువనేశ్వరి రాజకీయ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనడం ఈ ఎన్నికల్లో మరో ఆసక్తికరమైన అంశం. కోడలు బ్రాహ్మణితో కలిసి హెరిటేజ్ ఫుడ్స్ సంస్థను నడుపుతున్న భువనేశ్వరి చాలా అరుదుగా బహిరంగంగా కనిపిస్తారు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో గతేడాది సెప్టెంబర్‌లో చంద్రబాబు అరెస్టయిన తర్వాత భువనేశ్వరి  వీధుల్లోకి వచ్చి నిరసన చెప్పడం తెలుగు తమ్ముళ్లలో కొత్త ఉత్సహాన్ని నింపింది. 1996లో ఎన్టీఆర్ మరణానంతరం జరిగిన ప్రతి ఎన్నికల్లో మాదిరిగానే ఆయన పేరు, చిత్రపటాలు, విగ్రహాలు టీడీపీ ప్రచారంలో ఈ సారి కూడా అంతర్భాగంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ గుత్తాధిపత్యానికి చరమగీతం పాడేందుకు ఎన్టీఆర్ 1980వ దశకం ప్రారంభంలో రాజకీయాల్లోకి ప్రవేశించి రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని శాశ్వతంగా మార్చేసిన విషయం తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 2 =