రూ.100 వెండి నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ ముద్రించడం సంతోషకరం, తెలుగువారందరికీ గర్వకారణం: చంద్రబాబు

TDP Chief Chandrababu Expressed Happiness Over Centre's Decision to Print NTR Image on 100 Rupees Silver Coin,Happy To Print Ntr Figure,Ntr Figure Rs 100 Silver Coin,Source Of Pride For Telugu People,Chandrababu,Mango News,Mango News Telugu,Tdp Chief Chandrababu Naidu,AP CM YS Jagan Mohan Reddy,YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి, విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్‌) కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఎన్టీఆర్ చిత్రంతో రూ.100 వెండి నాణెం ముద్రించటానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. త్వరలో ఎన్టీఆర్ చిత్రంతో రూ.100 వెండి నాణాన్ని రిజర్వ్ బ్యాంక్ ముద్రించి విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పందించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం తెలుగువారందరికీ గర్వకారణం అని పేర్కొన్నారు. “రూ.100 వెండి నాణెంపై తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక, స్వర్గీయ ఎన్టీఆర్ బొమ్మను ముద్రించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంతోషకర విషయం. తెలుగువారందరికీ ఇది గర్వకారణం” అని చంద్రబాబు ట్వీట్ చేశారు.

మరోవైపు ఎన్టీఆర్ కుమార్తె, మాజీ కేంద్రమంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి ట్వీట్ చేస్తూ నందమూరి తారక రామారావు బొమ్మ 100 రూపాయల నాణెం మీద ముద్రించబడుతుందని, శతజయోత్సవంలో ఇది ఒక మైలురాయి అని అన్నారు. “నన్ను అనుగ్రహించిన భగవంతుడుకి, నన్ను ఆశీర్వదించిన నా తండ్రికి మరియు అన్నివిధాల తన సహకారం అందించిన నిర్మలా సీతారామన్ కి నా ధన్యవాదాలు. మింట్ అధికారులను కలవడం జరిగింది” అని దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × three =